పుట:PadabhamdhaParijathamu.djvu/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంచు______అంజ 7 అంజ_______అంజె

అంచులు తీరు

  • సమగ్ర మగు, నిం డగు.
  • చూ. అంచులు తీరిన వయసు.

అంచెలు గట్టు

  • బారులు కట్టు.
  • "అనిలంబు లేడును నంచెలంచెలు గట్టి యాకాశవీధి నందంద నడవ."
  • కాశీ. 1. 182.
  • "అంచెలు గట్టి కాళ్లతొడు పై చననీవు గదమ్మ ప్రోదిరాయంచలు?
  • మను. 5. 61.

అంచెలంచెలుగా

  • అక్కడక్కడా ఆగుతూ దశలవారీగా.
  • అలుగురాజు. 42 పు.

అంచెలమీద

  • అక్కడక్కడా గుఱ్ఱాలను మారుస్తూ.
  • పూర్వం తపాలు తీసుకొని పోవుటకూ, ఏదయినా రాజ కార్యముమీద పోవునపుడూ సరాసరి ఒకే గుఱ్ఱం లేదా గుఱ్ఱాలజత చాలదూరం పోవడం అసంభవం కనుక అక్కడక్కడా వానిని మార్చి వెళ్లేవారు. దానిమీద వచ్చిన పలుకుబడి.

అంజనమున మాటలాడ నేల?

  • కనబడుతున్న దానికి వర్ణన యెందుకు?
  • నిధులు తెలుసుకొనుటకు అంజనమును వేసేవారు, ఏవో కొన్ని మూలికలను కాల్చి ఆపొడిని నూనెలో కలిపి అంజనం తయారు చేస్తారు. దానిని తమలపాకువంటి దాని మధ్యలో బొట్టుగా పెట్టి దీపంముందు దాని నుంచి ఎవరినో-సామాన్యంగా పిల్లలను చూడ మంటారు. అందులో అవన్నీ వారికి స్పష్టంగా కనిపిస్తాయని అంటారు. కనబడుతున్న దానికి ఇక చెప్పవలసిన అవసరం లేదు కదా! అందుపై వచ్చినపలుకుబడి.
  • "అంజనంబున మాటలాడ నేమిటికి? ముంజేతి కంకణంబున కద్ద మేల?"
  • సారం. 1. 844.

అంజలి గుంజలి యార్చు

  • గట్టిగా అఱచు.
  • "అంజలి గుంజలి యార్చి."
  • బసవ. 4. 194.

అంజలి చేయు

  • నమస్కరించు.
  • "అనలుం డంజలి చేసె నంతకుడు సాష్టాంగంబు గావించె." పారి. 3. 7.

అంజలి యొనర్చు

  • నమస్కరించు.
  • "జయదేవ సుకవి కంజలి యొనర్చి."
  • రుక్మాం. 1. 13.

అంజెలు వేయు

  • గబగబ నడచు.
  • "ఆ అమ్మాయి వచ్చిం దనేసరికి వాడు