ఈ పుట ఆమోదించబడ్డది
ఓప____ఓప్రొ 320 ఓమ____ఓర
ఓప ననక
- చేయజాల ననక.
- "ఏమి యమరింతు వన్ని నాయింట నిండి, యున్న విప్పుడ యమరింతు నోప ననక." శుక. 3. 188.
ఓపనిది
- భరింపరానిది.
- "ఓపనిదాని దాల్పగా, నావశ మయ్య భూరిభువనత్రయదుర్వహభారమమ్మహా, దేవు నవార్యవీర్యము." కుమా. 10. 15.
ఓపిక లేక
- ఓరిమి లేక; త్రాణ లేక. ఏదైనా పని చేయుటకు తగిన ఓరిమి లే దన్నప్పుడే రాయలసీమలో ఓపిక లే దన్నమాట ఉపయోగిస్తారు. తీరప్రాంతాల్లో త్రాణ లేదు. తగినంత బలం లేదు అన్న అర్థంలో ఓపిక లేదు అంటారు. ఇక్కడ రెంటికీ సరిపోతుంది.
- "నడువ నోపిక లేక నడుమ నడుమ." కా. మా. 3. 193.
ఓపినట్లు
- చేత నయినంతవఱకు.
- "ఒసగి క్రోలిరి మైరేయ మోపినట్లు." శుక. 3. 118.
ఓ (ఒక) ప్రొద్దున లేచు
- అర్ధ రాత్రంలో లేచు.
- "వా డోపొద్దున లేచి పొలానికి వెడతాడు." వా.
ఓ మన్యథా యను
- అంగీకారమునూ, వ్యతిరేకతనూ తెలుపు.
- "ఓ మన్యథా యంచు నొరయు విద్వాంసుల, గోష్ఠి కెన్నడు గడగుఱుతు లేదు." కళా. 7. 19.
ఓ యను
- పిలిచిన పలుకు; సిద్ధ మగు.
- "ఒక యెలమావిక్రింద మరు డో యనగా నరు డుండె నయ్యెడన్." విజయ. 1. 212.
ఓ యింత ప్రొద్దు
- చాలసేపు.
- "ఓయింతపొద్దు ఏమీ తోచక అట్లా ఉండిపోతిని." వా.
- రాయలసీమలో ప్రచురం.
ఓరంతప్రొద్దు
- 1. ఒకరో జంతా.
- "ఓరంత ప్రొద్దున నుపవసించె." కాశీ. 4. 133.
- "ఓరంతప్రొద్దున నుందు రుద్రుండ నే, నటు గాన రుద్రదేహాఖ్య యయ్యె." కాశీ. 5. 10.
- 2. కాసేపు.
- "రతిసుఖంబుల జొక్కు నోరంత ప్రొద్దు." కా. మా. 2. 18.
ఓరచూపు చూచు
- 1. అనాదరముగా చూచు.
- "ఓరచూపు జూచేది న్యాయమా?" త్యాగరాజు.
- 2. కడగంటి చూపు చూచు.
- శృంగారసూచకము.
- "సొగసి సొగయించు నెఱ యోర చూపు చూచి." హంస. 3. 81.