పుట:PadabhamdhaParijathamu.djvu/336

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఒడ____ఒడ 310 ఒడ____ఒడి

 • "వాడు ఒళ్లు వంచి పని చేస్తాదు." వా.
 • "వానికి ఏ పని చేయడానికీ ఒళ్లు వంగదు." వా.

ఒడ లెల్ల కన్నులుగ చూచు

 • ఎక్కువ ఆసక్తితో చూచు.
 • "....సహస్రదృక్తనూజుని నొడ లెల్ల గన్నులుగ జూచిరి మానసముల్ గరం గగన్." విజయ.

ఒడ లెల్ల కాళ్లు

 • కాళ్లు నడుచుటకు సాధనాలు. ఒడ లంతా కాళ్లై అనగా గబగబా పరుగు లిడు ననుట.
 • "వడి బాఱు జలమున కొడ లెల్ల గాళ్లు." బస. 2. 33.
 • రూ. తను వెల్ల - ఇత్యాదులు.

ఒడలెల్ల తలలు

 • పరిపూర్తిగా, అంతా అదే యై అను అర్థంలో ఒడ లెల్ల.
 • "వడి వీచుగాడ్పున కొడ లెల్ల దలలు." బస. 2. 33.
 • చూ. ఒడ లెల్ల భక్తి.

ఒడ లెల్ల నోళ్లు

 • శరీర మంతా నోరుగా మారిన దనుట. నోరు తినునది.
 • "వడి గాలుచిచ్చున కొడ లెల్ల నోళ్లు." బస. 2. 33.
 • చూ. ఒడ లెల్ల తలలు.

ఒడ లెల్ల భక్తి

 • పరిపూర్ణ మైన, ఏకాగ్రమైన భక్తి. శరీర మంతా - అత్యధిక మైన భక్తి అనుట.
 • "పడి జేయుబసవన కొడ లెల్ల భక్తి." బస. 2. 33.
 • రూ. తను వెల్ల శిరము ఇత్యాదులు.

ఒడ లోము

 • 1. శరీరరక్షణ చేసుకొను; ఒడలు దాచుకొను.
 • "ఒడ లోముటలు మోహ ముడుగునందాక." తాళ్ల. సం. 5. 152.
 • 2. జాగ్రత్తగా మెలగు. కృశించు అన్న అర్థం కొన్ని కోశాలలో ఇచ్చారు. కాని అది సరి కా దనిపిస్తుంది.
 • "ఒడ లోమి పెద్ద కాలం, బడవుల బడి." కుమా. 11. 43.

ఒడ లోముకొను

 • ఒళ్లు దాచుకొను.
 • "ఒడ లోమికొని మీర లున్నచో." వర. రా. కిష్కి. పు. 520. పంక్తి. 22.
 • చూ. ఒడలు దాచు.

ఒడలోర్చు

 • శ్రమకు తట్టుకొను. సుమతి. 49.

ఒడిగట్టు

 • 1. సిద్ధపడు.
 • "జీవులంగొట్టు రట్టున కొడిగట్టు వేలుపు." కా. మా. 4. 108.
 • 2. పాల్పడు. ఏదైనా తీసుకొనునప్పుడు ఒడిని పట్టి అందులో తీసుకొనే అలవాటుపై వచ్చినపలుకుబడి. వాడుకలో 'ఎంత పాపానికి ఒడిగట్టినాడువాడు' అంటారు.