పుట:PadabhamdhaParijathamu.djvu/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అంగు______అంచ 6 అంచి______అంచు

అంగుడు లేదు

 • నోరు చచ్చినవా డనుఓట్ల ఉపయోగించేమాట.
 • "అంగుడు లేనట్టుగా అలా కూర్చున్నావేమి రా?" వా.

అంగుదారు

 • ప్రోత్సాహకుడు
 • బోగంమేళంలో వెనుకపాట పాడేవారిని అంగుదారు లంటారు. తద్ద్వారా వచ్చిన పలుకుబడి.
 • చూ. హంగుదారు.

అంగుష్ఠమాత్రుడు

 • పొట్టివాడు.
 • "అంగుష్ఠమాత్రుడికి ఆ అమ్మాయిని అలా యిస్తాము. అదేమో ఒడ్డూ పొడుగూ అయిన పిల్ల.""

అంగోస్త్రపు పొట్ట

 • లావాటి మనిషి.

అంచనా వేయు

 • ఏపని కయినా ముందు ఇంత కావచ్చు నని ఉజ్జాయింపుగా లెక్క వేయు.
 • "ఈ ప్రాజెక్టుకు యాభైలక్షలు అవుతుందని అంచనా వేశారు."
 • "ఈపని రెండునెలలలో కావచ్చు నని అంచనా వేశాము. చూడాలి." వా.
 • చూ. అంచించు/

అంచపదము

 • హంసపాదు.
 • వ్రాతలో ఏ దయినా మరిచి పోతే హంసపాదము వంటి గురుతు వేసి పైన వ్రాస్తారు. అందుపై వచ్చినపలుకుబడి.

అంచించు

 • అంచనా వేయు.
 • తమి. "అంజిత్తల్."
 • చూ. అంచనా వేయు.

అంచి పుచ్చు

 • పంపు.
 • "ప్రతిగ నందుల కంచి పుచ్చు."
 • భార. అశ్వ. 3

అంచు గట్టుకొని వచ్చు

 • అంతము సమీపించు, ముగియ వచ్చు.
 • "వాడి కేదో అంచు గట్టుకొని వచ్చింది. అందుకే నాతో చెల్లాటం ఆడుతున్నాడు." వా.
 • "ఆ వ్యవహారం అంచు గట్టుకొని వచ్చింది. ఇక తెలుస్తుంది అయ్యపని." వా.

అంచుముట్టని

 • వగ దెగని
 • "ఈయంచుముట్టని సింగారము లేమి?"
 • పాంచా. 4 అ.
 • "ఇంకా యీపని అంచుముట్ట లేదు. ఇదేమి అంచు ముట్టే వ్యవహారంగా లేదు." వా.

అంచులవాడు

 • చిత్రకారుడు, బట్టలకు రంగులు వేయువాడు.

అంచులు తీరినవయసు

 • సమగ్రయౌవనము.
 • "అంచులు తీరినవయస్సులో ఉందా? అలా చేయక ఏం చేస్తుంది?" వా.