పుట:PadabhamdhaParijathamu.djvu/31

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అంగ_______అంగి 5 అంగి_______అంగు

అంగరొల్లెలు

  • ఒకరక మైనపిండివంట. హంస. 1,105.

అంగలార్చు

  • ఏడ్చు, వగచు
  • "అకంఠంబుగ నీవు మాధుకరభిక్షాన్నంబు భక్షింపగా లేకున్నన్ గడు నంగలార్చెదవు మేలే లెస్స." కాశీ. 7,162.
  • "రాలేదు రాలేదు అని ఊరికే అంగలారుస్తూ కూర్చుంటే ఏం లాభం రా ? ఏదో ఒకటి చెయ్యాలి గాని." వా.

అంగలు వేయు

  • కాలు చాచి అడుగుడు, గబ గబా నడచు
  • "వాడు అంగలు వేసుకొంటూ వెళ్లాడు." "వాడు అంగలు వేసుకుంటూ నాలుగు నిమిషాల్లో ఇల్లు చేరుకున్నాడు." వా. చూ. అంజెలు వేయు.

అంగళ్ళవాడ

  • .బజారు, అంగడివీధి

అంగవస్త్రము

  • పై పంచ-ఉత్తరీయము.

అంగిట నూరు అమృతము

  • అందుబాటులో ఉన్న మనోరథపరిపూర్తి కారకము.
  • ముంగిటపెన్నిధి అనుట.
  • ఏమాత్రం శ్రమించక అంగిటనే అమృత మూరుతుంటే ఇం కేం? ఎంతైనా త్రాగవచ్చు గదా. అందుపై వచ్చినది.
  • "ముంగిటపెన్నిధి దంగేటిజున్ను, నంగిట నూరెడునమృతం బనంగ"
  • చూ. ముంగిటపెన్నిధి.

అంగిటబెల్ల మై

  • ఏమీ అన లేక
  • "అధిపు డాడుమాట కంగిటి బెల్ల మై కూరుచుండి రొదిగ గుటక లిడుచు."
  • నాయకు. 44 పు.

అంగిటముల్లు

  • కిఱునాలుక, కొండనాలుక అగు.
  • "నీకు నఱిమియో? కోనయో? యంగిట ముల్లొ? ఎఱుగను మందు ంరాకేమి?" బసవ. 3 అ. 59 పు.

అంగిటము ల్లొత్తు

  • చిఱునాలుక లేక కిఱునాలుక-కొండనాలుక జారినప్పుడు దగ్గు వస్తుంది. దానిని వెల్లుల్లి, మిరియం దంచి నడిమివేల నుంచుకొని ఒత్తుతారు. అది పైకి వెళ్ళి పోతుంది.
  • బస. 3 అ. 58 పుట.
  • చూ. చిఱునాలు కగు. కొండనాలుకగు.

అంగుటమున నేల వ్రాయు

  • కాలి బొటనవ్రేలితో నేల వ్రాయు. ఇది సిగ్గును సూచించును.
  • ద్విప. భాగ. 134 పు.

అంగుడుదుడువు

  • మాటలు మోసేవాడు, తంటాలమారి.