పుట:PadabhamdhaParijathamu.djvu/308

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏను____ఏను 282 ఏను____ఏనే

ఏనుగుపాడి

  • సమృద్ధి.
  • "ఇచ్చెనా యేనుగుపాడి." విజ. పీఠిక. 54.

ఏనుగు పీను గగు

  • బాగా దృఢంగా ఉండినవాడు చాలా చిక్కిపోవు.
  • "ఆ జ్వరంతో ఏనుగు పీనుగయి పోయాడు పాపం!" వా.

ఏనుగు పురు డోమ గల

  • ఏనుగునకు పురుడు పోయగల. అసాధ్య కార్యములను నెఱవేర్చుజాణ అనుట.
  • కుమా. 8. 153.

ఏనుగుమీద సున్న మడుగు

  • తన శక్తిని మించినదానికై ప్రయత్నించు. కొవ్వుపట్టి ప్రవర్తించు.

ఏనుగుమీద సున్నము

  • అలభ్యము.
  • "అతని తాంబూల గంధాస్యాప్తి యేనుగు, మీది సున్నం బని మేన యెంచె." కవిరా. 3.

ఏనుగు మీదివానిని సున్న మడుగు

  • అత్యహంకారంతో ప్రవర్తించు.
  • ఏనుగుమీద ఉన్నవా డేమో అంత ఎత్తులో ఉంటాడు. వానిని ఆకుల్లోకి సున్న మివ్వ మనడం వట్టి పొగరు కాక మరేమిటి?
  • "వాడా అమ్మా! ఏనుగుమీదివానిని సున్న మడిగేరకం." వా.

ఏనుగు మైథునానికి ఏట్రింత రాయబారము

  • పెద్దల పనికి అల్పులు ప్రయత్నము.
  • చూ. ఏట్రింత రాయబారము.

ఏనుగుల కొమ్ములు వచ్చినట్లు

  • అసలే బలము కలదానికి మఱింత బలము చేకూరినట్లు.
  • "ఎనసి మనంబునందు సతికిం బతికిన్ వల పంకురించినన్, గొనకొని ధాత్రి నేనుగుల కొమ్ములు వచ్చినయట్టు లింక ని, ప్పనికి బ్రనూనసాయకుడె పైతరువు..." వైజ. 3. 10.

ఏను గెక్కినట్లు

  • ఎంతో లాభం కలిగినట్లుగా. ఎక్కువ సంతోషించు ననుట.
  • "వాడి కేముంది పాపం ! ఒక పూట భోజనం పెడితే చాలు. ఏను గెక్కినట్లుగా సంతోషిస్తాడు." వా.

ఏ నెఱిగిన బ్రతుకే గద

  • నీ బ్రతుకు నాకు తెలిసినదే కదా! నిరసనగా అనుమాట. నేటికీ వాడుకలో ఉన్నది.
  • "ఏ నెఱిగిన బ్రతుకే గద, యీ నడవడి యెట్లు కలిగె నింతటిలోగా, తా నిక్షేపము గంటివో." శుక. 3. 262.
  • "వానిబతుకు నే నెరిగిందే కదా ?" వా.