పుట:PadabhamdhaParijathamu.djvu/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఏను_____ఏను 281 ఏను_____ఏను

సహజంగా అది లెక్క చేయదు కదా!

 • "పసిడి దె మ్మనుచు నే బలుమాఱు వేడ, మిసుగ వేనుగు గవ్వ మీటిన యట్లు." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 161-62.
 • చూ. దున్నపోతుమీద వాన కురిసినట్లు.

ఏనుగుతో ఏలాటము

 • అధికులతో చెరలాటము. కూడని దనుట. నిప్పుతో చెర మాటమువంటిది.
 • వేంకటేశ. 35.

ఏనుగుదాహము

 • విపరీత మైనదాహము.
 • "నాకు ఏనుగుదాహంగా ఉంది." వా.

ఏనుగు దిన్న వెలగకాయ

 • బయటికి బాగా కనిపించినా లోపల ఏమీ లేనిది. ఏనుగు వెలగపండు మింగితే లోపలి గుజ్జుమాత్రం అరిగిపోయి, కాయ అలాగే బయటికి వచ్చు నని ప్రతీతి. అందుపై వచ్చినపలుకుబడి.
 • "ఏనుగు దిన్నట్టి వెలంగ కాయగతి నుందుర్ లోన లో టై బయల్ సొగసై." నిరంకు. 3. 8.
 • చూ. కరి మ్రింగిన వెలగపండు.

ఏనుగునకు సిళ్లు చూపినట్లు

 • ఎఱ్ఱగుడ్డలు మొదలగునవి చూపి పశువులను బెదరించినట్లు, ఏనుగను బెదరగొట్టితే విజృంభిస్తుంది.
 • బెదిరిన పశువులు విఱుచుకొని పడడం సహజం.
 • "అపుడు రాధేయు డిమ్మెయి ననుజు పాటు, జూచి యేనుగునకు సిళ్లు నూపినట్లు, గనిసి హయముల మత్స్యభూకాంతుతనయు, నేసి పండ్రెండు శరముల నేసె నరుని." భార. విరా. 5. 84.

ఏనుగుపండ్లు పట్టి చూచు 8పెద్దవారి తప్పు లెన్ను. ప్రమాదకర మై ఆత్మ వినాశకర మైనపని చేయుపట్టుల చెప్పే సామ్యం.

 • "తనర నేనుగుపండ్లు దా బట్టి చూచు, మనుజుండు బ్రతుకునే మడియున కాక." బసవ. 4. 97.
 • చూ. ఏనుగుపల్లు పట్టి చూచు.

ఏనుగు పన్నగునే గాడిదలకు ?

 • ఏనుగుదంతం గాడిదకు తగునా? అననురూప మైన దనుటను తెలుపు పలుకుబడి.
 • "వూని లింగ ప్రసాదానూనసుఖము, మానవులకు బొందగా నెట్లు వచ్చు, నేనుంగు పన్నగునే గాడిదలకు..." బస. 7. 198.

ఏనుగుపల్లు పట్టి చూచు

 • పెద్దవారి తప్పొప్పుల నెన్ను.
 • "పురుషుడు పాపకర్ము డన బోలదు కాంతయె కాని కాంతకుం, బురుషుడు కీడు చేసినను భూషణ మేనుగు బల్లువట్టి చూ, తురె మగవాడు చేసె నని తొయ్యలియుం..." విక్ర. 7. 174.
 • చూ. ఏనుగుపండ్లు పట్టి చూచు.