పుట:PadabhamdhaParijathamu.djvu/306

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏదు___ఏధ 280 ఏని____ఏను

నీ వేదియు లేక సర్వగుణహీనుడ వౌట యెఱుంగ దమ్ముడా!" పాండు. 3. 39. ఏదుపల్లువోలె

  • ఒంటరిగా.
  • ఏదు పందికి ఒకటేపల్లు ఉండు ననుటపై ఏర్పడినది.
  • "మఱియు దానవసైన్యంబు మాఱులేక, యొప్పి తప్పిన నిర్జరయోధవరుల దోలి తొప్పరవెట్ట నింద్రుండు నిలిచె, బవరమున నొక్కరుడు నేదుపల్లు వోలె." ఉ. హరి. 1. 43.

ఏదో పేరు చెప్పి....

  • ఏదో ఒకరకంగా. అది అవసరం కాకపోయినా అనుట.
  • "ఏదో పేరు చెప్పి తనవాళ్లు నలుగురికి నాలుగురాళ్లు ముట్టేటట్టు చేసుకోవడం వాడిపని." వా.

....ఏదో ఒకటి అయితే

  • ఏ అనాహూతమో సంభవిస్తే నా గతి దుర్గతి అవుతుంది అనుపట్ల ఉపయోగిస్తారు.
  • "తొడింబడ నితని కొక్కటి యయ్యె నేని యే నేమి యగుదాన ననియు విచారించితేని..." కళా. 3. 264.
  • "ఈ ముసలావిడ యేదో ఒకటి అయితే నే నే మవుతాను>" వా.

ఏ ధనంబులు పొత్తు వోవు ?

  • ఏమి లాభము ?
  • "వారికి మనతోడి వైరంబు బూని, పోరాడ నే ధనంబులు పొత్తు వోవు." గౌ. హరి. ప్రథ. పంక్తి. 719-720.
  • వాడుకలో రూపం:
  • "మనతో కొట్లాడితే వాళ్ల కేం లాభం వస్తుంది?" వా.

ఏనికకాడు

  • ఏనుగవాడు, గజసై నికుడు.
  • కుమా. 11. 40.

ఏనుగ నెక్కించు

  • గొప్ప చేయు.
  • "వాణ్ణి ఊరికే పొగిడి పొగిడి ఏనుగు మీది కెక్కించారు. అంతే. పదివేల రూపాయల విరాళం ప్రకటించాడు." వా.

ఏనుగు నెక్కియు దిడ్డి దూఱ దగునె?

  • యోగ్యతకు తగినట్టుగా ప్రవర్తించక పోయినప్పుడు ఉపయోగించే పలుకుబడి.
  • ఏనుగు నెక్కి వచ్చువాడు సరాసరి సింహద్వారంగుండా రాక దొడ్డిదారిగుండా ప్రవేశించుట యెందు కనుట.
  • "ఇటువలె బల్కగా దగునె యేనుగు నెక్కి యు దిడ్డి దూఱగన్." రుక్మాం. 5. 105.

ఏనుగుకళ్లు

  • చిన్న కళ్లు.

ఏనుగుకాలు

  • బోదకాలు.

ఏనుగు గవ్వ మీటినయట్లు

  • ఏ మాత్రం లక్ష్యం లేనట్లు. గవ్వతో ఏనుగును కొడితే