పుట:PadabhamdhaParijathamu.djvu/291

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎద్దు____ఎద్దు 265 ఎన____ఎను

ఎద్దుమీద వాన కురిసినట్టు

  • ఏమీ పట్టించుకొనకుండా.
  • "వాడు ఎన్ని అంటే నేమి ? ఎద్దుమీద వాన కురిసినట్టుగా ఉంటాడు." వా.

ఎద్దుమొద్దు

  • ఒక తిట్టు. చదువు సాము రాని వారిని వట్టి బలం మాత్రం ఉన్న వారిని అంటారు.
  • "ముద్ది యనరాదు గ్రుద్దు నయ్యెద్దు మొద్దు." శుక. 3. 21.
  • చూ. ఎద్దు మొద్దుస్వరూపం.

ఎద్దుమొద్దుస్వరూపం

  • స్తబ్ధు, జడుడు అనుట.
  • "ఎద్దుమొద్దు స్వరూపాయ ఎనుపోతాయ నమోనమ:." చాటువు.
  • "వాడు ఒట్టి ఎద్దుమొద్దు స్వరూపం. వాణ్ణి కట్టుకొని మనం ఏం చేస్తాము." వా.

ఎద్దులు బండ్లు నేక మైన కొండ మీదికి పోవును

  • ఎద్దూ బండీ ఏక మైతే కొండ మీదికి పోగలవు. కలిసి పనిచేస్తే ఎంత అసాధ్య కార్య మైనా సాధింప వచ్చును అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "...యెందు నెద్దులు బండియు నేకమైన, గొండమీదికి బోవు నోకొమ్మ యనుచు." కళా. 3. 71.

ఎనవచ్చు

  • సాటి యగు. కాశీ. 5. 283.

ఎనిమిదివయట్టపు పారాయణము

  • బూతులు తిట్టుట. తె.జా.

ఎనిమిదో అఠ్ఠం

  • తిట్టు.
  • వేదాలలోని భాగాలను అఠ్ఠాలు, అష్టకాలు అంటారు. ఎనిమిదో అఠ్ఠం బూతుల పురాణం వంటిది.
  • "వాడికి దక్షిణ సరిగా ముట్టక పోయే సరికి ఎనిమిదోఅట్ఠం ఆరంభించాడు." వా.

ఎనిమిదో అఠ్ఠం పారాయణ చేయు

  • తిట్ల కారంభించు.

ఎనుపోతుపై వాన

  • సోమరి.
  • దున్న పోతుమీద వాన కురిసినా అది లెక్క చేయదు, కదలదు. అలాటివా డనుట.
  • "బూమి తుంటరి యెనుపోతుపై వాన." గౌ. హరి. ద్వితీ. పంక్తి. 1496.

ఎనుమునకు గీతము

  • వ్యర్థము. అయోగ్యునిదగ్గఱ పాండిత్య ప్రదర్శనము. వ్యర్థ మనుట. శరభాంక. 3.