పుట:PadabhamdhaParijathamu.djvu/292

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎన్న____ఎన్ని 266 ఎన్ని____ఎన్ని

ఎన్నడు లేనిది

  • అలవాటు లేనిది; అరుదుగా.
  • "ఎన్నడు లేని యింతకోపపు బలుకిది యేమి పడతి యనుచు...." కళా. 5. 58.
  • "వాడు ఎన్నడూ లేనిది ఈ రోజు మాయింటికి వచ్చాడు." వా.
  • "అతడు ఎన్నడూ లేనిది తన భార్యమీద కోప్పడ్డాడు." వా.

ఎన్నరాని

  • ఎక్కు వైన.
  • "ఎన్న రానీప్రేమ వానిచక్కదన మే నేల? కనుగొంటినే." హేమా. పు. 35.

ఎన్నాళ్లకో సెల్వుగా

  • చాలనాళ్ళకుగా - ఈ రోజు.
  • "గొనబుతో నెన్నాళ్లకో సెల్వుగా నేటి, కైన నిన్నెనయ నా కబ్బె ననుచు." హంస. 2. 169.
  • వాడుకలో ఇది నెల్లూరు చిత్తూరు ప్రాంతాలలో ఈ నాటికీ వినవస్తుంది.
  • "వాడు ఈ ఊరికి వచ్చి నెల నాళ్లయింది. ఇన్నాళ్లకు సెలవుగా ఈ రోజు కన్పించాడు." వా.

ఎన్నిక కెక్కు

  • ప్రసిద్ధి చెందు.
  • "చక్రదాసు డన నెన్నిక కెక్కిన పేరు గల్గి..." హంస. 5. 8.

ఎన్నిక మీఱు

  • ప్రసిద్ధి కెక్కు.
  • "బంధుకోటిలో నెన్నిక మీఱుచుం బెరిగె." రుక్మాం. 1. 148.

ఎన్నికొను

  • పేర్కొను.
  • "వీనిజాడ లీజటివరు లెల్ల నెన్ని కొనంగ, వినియుందు." వర. రా. అర. పు. 148. పంక్తి. 11.

ఎన్ని గుండెలు !

  • "నాతి యిట్లు వేడు న న్నాదరింపక, పోవు నిన్ను నింక బురుషు డొక్కం, డెవడు నే దలంక నేరికి నెన్నిగుం, డియలు గలవు నాదుప్రియను జేర." కళ. వూ. 6. 38.
  • "వా డలా రాశా డంటే ఎన్ని గుండెలు?" వా.
  • చూ. ఎన్ని గుండె లున్నవి?
  • చూ. ఎన్ని తలలు?

ఎన్ని గుండె లున్నవి ?

  • అంత ధైర్య మెక్కడిది ? అంత ధైర్య మున్నదా అను పట్టుల ఉపయోగించే పలుకుబడి.
  • "అంత పండితుణ్ణి పట్టుకొని తప్పు పట్టడానికి వాడికి ఎన్నిగుండె లున్నాయి?" వా.
  • "నన్ను తిట్టడానికి వాని కెన్ని గుండెలున్నవి?" వా.
  • చూ. ఎన్నెదల్ గల్గె?

ఎన్ని చాళ్ల పట్టు ?

  • ఎంతదూరము. పొలాన్ని కొలిచేటప్పుడు రైతులు మామూలుగా ఎన్ని చాళ్లు పడేస్థలమో దానినిబట్టి లెక్క వేయడం అలవాటు. ఒక కాడియెద్దులు దున్నుటకు