పుట:PadabhamdhaParijathamu.djvu/290

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదు____ఎద్దీ 264 ఎద్దీ____ఎద్దు

ఎదురొమ్ముకుంపటి

  • "పతి కెదురొమ్ముకుంపటిగ బాల్పడ కుండనిలక్ష్మి." శ్రినివా. 174.
  • చూ. రొమ్ముకుంపటి.

ఎదురొమ్ములో ములుకఱ్ఱ పొడిచినట్లు

  • కటువుగా, బాధకరంగా.

ఎదుర్కొను

  • ఎదురేగు.
  • "ఎదుర్కొనె నీహారగిరీశ్వరుండు." హర. 4. 98.

ఎదుర్కోలు చేయు

  • ఎదు రేతెంచు; గౌరవించు. ఎవరైనా పెద్దలు వచ్చినప్పుడు వారి కెదురేగుట గౌరవసూచకము. దానినిబట్టి యేర్పడిన పలుకుబడి.
  • "తనచక్రమునకు నాతని దివ్య తేజంబు గురుభావమున నెదుర్కోలు సేయ...." కళా. 2. 140.

ఎద్దీనిం దంటే గాటిలో కట్టివేయ మన్నట్లు

  • అనాలోచితంగా. 'మంచీ చెడ్డా గమనించే ఓపిక యెక్కడిది వాడికి? తన సలహాదార్లు చెప్పితే చాలు - ఎద్దు యీనిం దంటే గాటిలో కట్టి వేయమంటాడు.' ఎద్దు ఈనడం అసంభవం అన్న ప్రశ్నే అతనికి తోచలే దనుట.
  • "అది న్యాయ్య మిది న్యాయ్య మని చూడ కెద్దీ నె, నన గాట గట్టు మంచాడు మనిరొ."
  • త్రిశంకుస్వర్గము. అంక. 2. పే. 15.

ఎద్దీనె ననిన గొంది గట్టుమటన్న చందము

  • అవునా కాదా అని విచారించక చెప్పగానే తలఊచు పట్ల ఉపయోగించేసామ్యం.
  • "ఎందైన నిటువంటి వెద్దీనె ననిన గొందిన గట్టు మటన్న చందములు తగునె."
  • పండితా. ద్వితీ. మహి. పుట. 145.
  • వాడుకలో:
  • "ఎద్దీనిం దంటే గాట్లో కట్టివెయ్య మన్నట్లుంది నీ వనేమాట." వా.

ఎద్దు తన్నే నని గుఱ్ఱము చాటున కేగు

  • ఒకబాధను తప్పించుకొనుటకై అంతకంటె పెద్దబాధకు తల యొగ్గు.
  • తాళ్ల. సం. 11. 3 భా. 74.

ఎద్దునకు అటుకుల రుచి యేమిటి?

  • 'గాడిద కేమి తెలుసు గంద వొడివాసన' వంటిది.
  • వెంకటేశ. 74.

ఎద్దు పట్టిన సివము

  • గంతులు వేయించునది. తాళ్ల. సం. 11. 3 భా. 26.