పుట:PadabhamdhaParijathamu.djvu/286

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎత్తు____ఎద 260 ఎద____ఎది

చదరంగంలో ఎత్తులు వేయడంపై వచ్చినపలుకుబడి. ఎత్తు వోవు

  • ఓదిపోయి పాఱు. కోడిపందెములలో ఈ మాటను ఇప్పటికీ ఉపయోగిస్తారు. 'ఆకోడి ఎత్తు పోయింది.' అలాగే 'కొప్పెత్తు' అను మాట కూడా ఉపయోగిస్తారు.
  • "అవియును నొకటొకటికి నె,త్తు వోవక పెనగిన గని మధుత్రిపురహరుల్." ఉ. హరి. 6. 160.

ఎత్తు సేయు

  • సమాన మగు.
  • "ఇంద్ర నీలపు రంగు నెత్తు సేయ గడంగు." రుక్మాం. 2. 125.

ఎద కొఱవి గొని చూడినట్లు

  • హృదయాన్ని కొఱివితో క్రుచ్చినట్లు. అంత బాధా కరంగా.కుమా.10. 142.

ఎదను పెంచు

  • హృదయ వై శాల్యము కల్పించు. నా. మా. 99.

ఎద నెగ్గు రను

  • మనసు బాధపడు. నెగ్గు రను, దిగ్గు రను, చివుక్కు మను, భగ్గు మను అనునవి ధ్వన్యనుకరణములుగా ఏర్పడినవి.
  • "ఒక మోహనాంగశృం, గారునితోడ దీపకళిక ల్వెలుగన్ నిదురించు చున్న యా,నీరజగంధి జూచి యెద నెగ్గు రనంగడు విస్మితాత్ము డై. శుక. 1. 204.

ఎదబడు

  • భయపడు. రాయలసీమలో ఎక్కువగా వాడుకలో నున్న పలుకుబడి.
  • "వాడిమాటలకు ఎదబడేవాళ్లు ఎవరూ లేరు." వా.
  • చూ. ఎదవడు.

ఎదలో రాయి పడు

  • భయము కలుగు.
  • "పదుగురు గల సభ యన న, ప్డెదలో రాయి పడి..." గుంటూ. ఉత్త. 23.
  • చూ. గుండెలో రాయి పడు.

ఎదవడు

  • భయపడు.
  • "పెదవులు దడవుచు భీతిచే జాల నెదవడి." వర. రా. అర. పు. 112. పంక్తి. 4.
  • చూ. ఎదబడు.

ఎదాన కొట్టుకొను

  • నెత్తిన వేసికొను అనుట వంటిది. నిరసనగా అనుమాట. కొత్త. 97.

ఎదిరి నిన్ను నెఱుగు

  • తనబల మెంతో ఎదుటివారి బల మెంతో తెలియు.