పుట:PadabhamdhaParijathamu.djvu/285

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎత్తు____ఎత్తు 259 ఎత్తు____ఎత్తు

ఎత్తున కెత్తు

 • సరికి సరి. ఆ వస్తువు ఎంత తూకమో అంతతూకము గల మఱి యొకటి ఇచ్చుటపై వచ్చినది.
 • "ఎత్తున కెత్తు అనఘ మీ కిచ్చెద." బస. 4. 120.

ఎత్తు పెట్టు

 • ప్రోత్సహించు.
 • "విలసిత మోహదాహ పరివేదన పొమ్మని యెత్తుపెట్టగా." హంస. 1. 114.

ఎత్తుఱోళ్లు

 • తిట్టుగా స్త్రీల దూషణలో ప్రయుక్త మైనది. ఎత్తుకొన్న ఱోలులాంటివా రని కావచ్చునేమో!
 • పండితా. ప్రథ. పురా. పుట. 343.

ఎత్తులిడు

 • ప్రోత్సహించు.
 • "...పలుమాఱు వచ్చిర మ్మనుచు మిగుల నెత్తు లిడియెడు నన్ను నా యింతి చూచి." కళా. 2. 170.
 • "ఇరువంక జెలు లెత్తులిడుచు లబ్బింపంగ జిఱు నవ్వులో గొంత సిగ్గు వదలి." కళా. 7. 76.

ఎత్తులు పెట్టు

 • ప్రోత్సహించు.
 • "పొద్దున్నుంచీ ఎత్తులు పెడితే వాడు బయలుదేరాడు." వా.
 • "ఎత్తులు పెట్టి ఎత్తులు పెట్టి వాణ్ణి పంపించాను." వా.

ఎత్తులు వేయు

 • తంత్రాలు పన్ను.
 • "మన ప్రయత్న మంతా భగ్నం చేయాలని వాడు ఎత్తులు వేస్తున్నాడు." వా.

ఎత్తువడు

 • మెత్తబడు; ఎత్తుబడి పోవు అనగా బలహీనపడి పోవు. ఈ క్రింది ప్రయోగంలో శ్లేషలో అర్థాలు రెండూ ఉన్నవి.
 • "తారాచలము వ్రేకదన మెంత వింశతి, బాహునిచే నెత్తువడియె నట్టె." కుమా. 3. 5.
 • "కంటకాగమభీతి గడచె నుద్ధత భూమి, భృత్కటకం బెల్ల నెత్తు వడియె." మను. పీఠిక. 34.
 • "ఆ యెద్దు యెత్తుబడింది." వా.
 • "అతడు నాలుగునాళ్లజ్వరంతో ఎత్తుబడి పోయాడు." వా.

ఎత్తువారిచేతిబిడ్డ

 • ఎవరు కాస్త మంచిమాట మాట్లాడితే వారివైపు ఉండే వాడు.
 • "ఈత డెత్తువారి చేతిబిడ్డ గాని యొక తెన్నున బోవువాడు గాడు. ఇట్టి వాని కొలువు మిక్కిలి కష్టము." నీతిచంద్రిక. మిత్రభేదము.
 • "వాడు ఎత్తువారి చేతిబిడ్డ. ఎక్కడ ఉంటే అక్కడి మాట." వా.

ఎత్తు వేయు

 • ఉపాయము పన్ను.
 • "వాడు స్కూలుకు డబ్బిస్తున్నాడంటే యేదో ఎత్తువేశా డన్నమాటే!" వా.