పుట:PadabhamdhaParijathamu.djvu/287

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎదు____ఎదు 261 ఎదు____ఎదు

  • "చిఱుత,వెదిరి నిన్ను మెఱుగవు." కుమా. 6. 10.

ఎదుగూ పొదుగూ

  • జంటపదం.
  • "వా డెంత తిన్నా ఎదుగూ పొదుగూ లేకుండా అలాగే ఉండి పోయాడు." వా.
  • "ఈ వ్యాపారం ఎన్నాళ్లైకైనా ఎదుగూ పొదుగూ లేకుండా అలాగే ఉండి పోయింది."
  • రూ. ఎదుగూ బొదుగూ.

ఎదుగు పొదుగు లేని

  • ఏమాత్రం పెరగని.
  • "ఎదుగూ పొదుగూ లేని ఈ జీతంతో ఎలా సంసారాన్ని నెట్టేదో తెలియడం లేదు." వా.
  • రూ. ఎదుగు బొదుగు లేని.

ఎదురాడు

  • ఎదిరించి మాట్లాడు, ధిక్కరించు.
  • "పెద్దలకు ఎదురాడ రాదు." వా.

ఎదురీత

  • జనాభిప్రాయం ఒకవైపు ఉండగా దానికి భిన్నంగా ప్రవర్తించుట. ప్రవాహం ఎటువైపు పోతుందో అటువైపు పోవడం సులువు. దానికి ఎదురుగా యీదడం కష్టం.
  • "కులభేదాలు మతభేదాలు పోవాలంటున్న రోజుల్లో నీ విలా కులం పేర పార్టీ పెట్టడం వట్టి ఎదురీత నాయనా!" వా.

ఎదురుకట్ల

  • ఎదురుగా.
  • "హిమశైలజాజిని యెదురుకట్లకు బోని." సారం. 3. 108.
  • "తమ యింటి యెదురుకట్ల." వి.పు. 7. 137.
  • నేటికీ ఈమాట యిదే రూపంలో రాయలసీమలో విశేషంగా వినవస్తుంది.
  • "ఇంత పెద్దవా డైనా నా తమ్ముడు నా యెదురుకట్ల నిలబడడు." వా.
  • "అన్న యెదురుకట్ల అతను నిలబడి ఎరగడు." వా.

ఎదురు కెదురు

  • బదులుకు బదులు.
  • "ఎదురు కెదు రేల కోపించె నిందు ధరుడు." భీమ. 4. 12.

ఎదురుకొను

  • మార్కొను.
  • "కావున మన మెదురుకొనం గావలయు." జైమి. 5. 164.

ఎదురుకోలు చేయు

  • ఎదురేగి వెళ్లు.
  • "అతడు నఖండవైభవంబున, దవు దవ్వులన యెదురుకోలు చేసె." కళా. 7. 69.

ఎదురుకోళ్లు

  • పెండ్లిలో ఒకవేపు వారు మరొకవేపు వారికి ఎదురేగి వెళ్లుట.
  • "పెండ్లికొడుకువాళ్ళు వస్తున్నారట. ఎదురుకోళ్ళకు వెళ్ళాలి." వా.