పుట:PadabhamdhaParijathamu.djvu/281

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎడ____ఎడ 255 ఎడ____ఎడ

నీ, కొడు కని యీతని నెంతయు, నెడమడుగున జూప దెత్తె యిందఱు నగ గాన్." భార. ఆది. 4. 99.

 • 2. భేదము, విలంబము. విరుద్ధము, కుటిలము. ఇడై మడిక్కై - తమిళం. వావిళ్ళ.
 • "ఈ పాలు ద్రావు మెడమడు గేమిటికి?" బసవ. 3. 62. పు
 • "ఏ యెడమడుగు లేని నెచ్చెలి, బొడ గాంచుట చచ్చి మరల బుట్టుట గాదే." భాగ. 10. స్కం. పు. 202.
 • "తోడితెం డెడమడు వేల యింక..." హరి. పూ. 9. 87.
 • "తత్సేవన తాత్పర్యంబు తగ నెవం బడియే ప్రొద్దును నెడమడు గగుమదితో ననుసరింపంగా..." హరి. పూ. 1.83.

ఎడమపిరి వెట్టు

 • అపసవ్యముగా ప్రవర్తించు.
 • "ఎడమపిరి వెట్టె నీమూఢు డెఱుకమాలి." రాధా. 3. 48.
 • చూ. ఎడమపురి వెట్టు.

ఎడమపురి వెట్టు

 • పురి విప్పు, అపసవ్యముగా ప్రవర్తించు.
 • "ఎడమపురి వెట్టె పరహిత వివేకములోన." తాళ్ల. సం. 11. 3. భా. 103.
 • చూ. ఎడమపిరి వెట్టు.

ఎడమ వెట్టు

 • ప్రక్కకు నెట్టు. ఇది నేటికీ దక్షిణాంధ్ర ప్రాంతంలో బాగా వాడుకలో ఉన్నపదం.
 • "సామాను లన్నీ తెచ్చాను అవన్నీ ఎడంగా పట్టు" అంటారు.
 • "కుడువంగ నొల్లక యెడము వెట్టి." హరి. పీఠిక. 14.
 • "విస్తట్లో అన్నీ వడ్డిస్తే అన్నీ ఎడంగా పెడుతున్నా వేమి?" వా.

ఎడమొగం పెడమొగం

 • సరిపడమి.
 • "వారికీ వీరికీ ఎడమొగం పెడమొగంగా ఉన్నది." వా.

ఎడ యెడ మాట లేల

 • ఆమాటలూ యీమాటలూ ఎందుకు? అవన్నీ అప్రస్తుతం అనుట.
 • "ఎడ యెడ మాట లేల ?" కవిక. 4. 146.

ఎడవాయు

 • వేఱుపడు.
 • "ఎడవాయని సఖులతోడ నెందున్నాడో." నిరంకు. 2. 80.

ఎడ సనక

 • దూరము పోక; అతి జాగరూకతతో.
 • "పతివ్రతారత్నము న, న్నెప్పు డెడసనక కంటికి, ఱెప్పవలెం గాచి తిరుగు రేయిం బవలున్." శుక. 1. 389.

ఎడసిపోవు

 • తొలగిపోవు.
 • "బొంకుమాట లెడసిపోయిన గాక శంక యేల మాను." తాళ్ల. సం. 5. 62.