పుట:PadabhamdhaParijathamu.djvu/282

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎడ____ఎడ్లు 256 ఎత్త____ఎత్తి


ఎడ సేయక

 • ఆలస్యము చేయక.
 • "మాయకా డెతెంచి మనలను గల్ల, సేయుచున్నా డెడసేయక వీని దెగటార్పు."
 • గౌ. హరి. ప్రథ. పంక్తి. 1853-55.

ఎడసేయు

 • ఎడబాపు, లోటు కలిగించు.
 • "చిలుకలకొల్కి ! యెవ్వ రెడసేసిరి నీ కిటు లేల చింతిలన్." పారి. 1. 117.

ఎడసొచ్చు

 • దిగు.
 • "దుష్క్రియా, శూరత కిట్టివార లెడ సొచ్చుట గంటిమొ." నిరంకు. 2. 13.

ఎడ పెడా

 • అటూ యిటూ.
 • "వాడు యెడాపెడా నాలుగు వాయించి పంపించాడు." వా.

ఎడ్దకత్తెర నాలుక బెల్ల మగు

 • లోపల యేమున్నా పైకి ప్రియంగా మాట్లాడు. పయోముఖ విషకుంభము లాంటిది.
 • "వికచముఖు డగుచు శాత్రవు, లకు హితు లగునట్టివారలం గని భూపా,లకు డెడ్దకత్తెరయు నా, లుక బెల్లము నై మనంబులుం గనవలయున్." భార. శాంతి. 3. 268.

ఎడ్లు దున్ని గుఱ్ఱముల మేపు

 • ఒకరు బాధపడి మరొకరిని పోషించుపట్ల ఉపయోగిస్తారు. ముఖ్యంగా బాధపడేవారు మంచివా రనీ, ఇతరులు కారనీ సూచన కూడ కలదు. రుద్రమ. 39 పు.

ఎత్తర తత్తర చేయు

 • ఉక్కిరిబిక్కిరి చేయు.
 • "ఎల్ల విటాగ్రగణ్యులను ఎత్తరతత్తర చేసినట్టి..." పాణి. 2. 102.

ఎత్తికోలు

 • ప్రయత్నము, ఆరంభము.
 • "ధాత మదియెత్తికోల్ తుది దాక కున్నె." నైష. 1. 82.
 • దీనికి దగ్గరగా ఉన్నదే ఎత్తుగడ.
 • చూ. ఎత్తుగడ.

ఎత్తిచ్చు

 • ఎదుటివారికి నేర్పు.
 • "ఎల్లవారికిని ఇదె యెత్తిచ్చె ననవు గదా కల్లరితనమున చీకటిలోని సుద్దులు." తాళ్ల. సం. 3. 650.
 • "వాణ్ణి నేను అడుగుతున్నాను. వా డేమీ చెప్పక ముందే నువ్వు ఎత్తిస్తావెందుకు?" వా.

ఎత్తినకాలు దించకుండా

 • నిర్విరామంగా.
 • "కోడి కూసినప్పటినుంచీ ఎత్తినకాలు దించకుండా పని చేస్తూనే ఉన్నాను. ఇంకా తెమల లేదు." వా.

ఎత్తినకే లెత్తినట్లే యుండు

 • ఉన్న దున్నట్లుగానే.
 • "దృఢముష్టిం బూని బల్గత్తి యె,త్తినకే లెత్తిన యట్ల యుండ దివి నుద్వేగంబునం బోవుచున్." కళా. 3. 152.