Jump to content

పుట:PadabhamdhaParijathamu.djvu/277

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎగ____ఎగ 251 ఎగ____ఎగా

  • "వాడు పది రూపాయలు తీసుకొని ఎగనామం పెట్టాడు." వా.
  • చూ. నామం పెట్టు.

ఎగనుబ్బు

  • ఉప్పొంగు.
  • "తదీయంబు లగు కృతక తరంగిణీ జాలంబులు కటిదఘ్నంబులు బెందొడలబంటులు నై యెగ నుబ్బి దిబ్బ తీర్థంబు లై పొరలి తెర లెత్తి." విప్ర. 2. 14.

ఎగబెట్టు

  • 1. ఎగ వేయు.
  • "వాడిస్తాను ఇస్తా నని కడకు ఎగ బెట్టాడు." వా.
  • 2. ఎత్తిపెట్టు.
  • "కాసేపు ఉండు. సామాను ఎగబెట్టి వస్తాను." వా.
  • ఈ అర్థంలో రాయలసీమలో ఈ మాట విరివిగా వినవస్తుంది.

ఎగబోయు

  • పురి ఎక్కించు.
  • "భూపాలునకు నెగబోసి యీర్ష్య." సారం. 3. 185.

ఎగరాసి దిగరాసి

  • లెక్కలలో ఏదో తారాతికిడీ చేసి.
  • "సంవత్సరం కిందట నూరురూపాయలు తీసుకుంటే, ఆ సెట్టి ఎగరాసి దిగరాసి నూటయాభైరూపాయలకు తేల్చాడు." వా.

ఎగవిడుచు

  • వదలిపెట్టు (ఇతరులకోస మై).
  • "తెక తేరగ నీ కెగ విడిచి పోయెదనె ప్రా,వగ నాకాణాచి యైన వలపుల పంటన్." కళా. 3. 202.

ఎగవేయు

  • ఇవ్వవలసింది, చేయవలసింది ఇవ్వక, చేయక - తప్పించు కొను.
  • "వాడీరోజు పని ఎగ వేశాడు." వా.
  • "నాకు వాడు నూరురూపాయ లివ్వవలసి వుండి ఎగవేశాడు." వా.

ఎగసన త్రోయు

  • ఎక్క పెట్టు. ఇది అన్యాయ మన్న సూచనా ఉన్నది.
  • "వాళ్లూ వీళ్లూ ఎగసన తోయడంతో వాడు అన్నకొడుకును యింటినుండీ తరిమేశాడు." వా.

ఎగా దిగా

  • పైనుండి క్రిందివరకూ.
  • చూ. ఎగ దిగ చూచు.

ఎగాదిగ కనుగొను

  • కోపముతో ఎదిరిని నిలు వెల్లా చూచు.
  • "కన్ను లెఱ్ఱగా నెగాదిగ గన్గొని, యౌడు గఱచి దీని నాటదేని...." శుక. 4. 39.
  • రూ. ఎగా దిగా చూచు.

ఎగా దిగా చూచు

  • తేరిపార జూచు.
  • "అలా ఎగా దిగా చూస్తున్నా వేమి ? గుర్తుపట్టలా ?" వా.
  • చూ. ఎగ దిగ చూచు.