పుట:PadabhamdhaParijathamu.djvu/276

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కు____ఎగ 250 ఎగ____ఎగ

డవు డెక్కు డించె ద,త్కాంత ప్రభాత మయ్యె నని." శుక. 1. 217. ఎక్కుడుగోద

  • వాహన మగు ఎద్దు, ఎక్కుటెద్దు.
  • "ఎక్కుడు గోద ని న్నెక్కడ వైచి, యెక్కడ వోయె." బస. 3. 69.

ఎక్కువ తక్కువ లేకుండు

  • సమానరూపముతో నుండు.
  • "ఎక్కువ తక్కువ లింతయు లేకన్ ఒక్క రూపమున నున్నవి చూడన్." సుద్రీ. 241.

ఎక్కువ తక్కువ లేక

  • సమానముగా, ఒకేతీరుగా.
  • "ఎక్కువ తక్కువ లెందు నించుకయు గ,ల్గక నేరు పొక్కలీలన తనర్ప." కళా. 8. 68.

ఎక్కే గుమ్మం దిగే గుమ్మం

  • ఏదో ఒక పనికై యింటింటికీ పోవుపట్ల అంటారు.
  • "పొద్దున్నుంచీ ఎక్కేగుమ్మం దిగేగుమ్మం. దీంతోనే సరిపోయింది." వా.

ఎగ ఊపిరి దిగ ఊపిరిగా ఉండు

  • మహా అలసటగా - ఆయాసముగా ఉండు.
  • "కొండెక్కి దిగేసరికి ఎగ ఊపిరి దిగ ఊపిరిగా ఉంది." వా.

ఎగచేపు

  • పా లివ్వకుండు (ఆవు మొదలయినవి)
  • చేపుట కిది వ్యతిరేకము.
  • "రాత్రి ఆవు ఎగ చేసింది. పొద్దున్న మజ్జిగనీళ్లు లేకుండా పోయినవి." వా.

ఎగజోపు

  • పై కెగురునట్లుగా పక్ష్యాదులను చోపు.
  • "ఒక వేళ డేగవేటకు జని యెగజోపి." కా. మా. 3. 47.
  • "వాటి నిలా ఎగజోపుక రారా. నే నిక్క డుంటాను." వా.

ఎగదట్టు

  • పైకి పోవు. అతిశయించు.
  • పాండు. 5. 182.
  • "వాడికి ఊపిరి ఎగదట్టింది." వా.

ఎగదిగ చూచు

  • దిక్కులు చూచు.
  • "చిగురుటాస దగిలి చింతాజలధి బడి, యెగదిగ జూడ బోతే యెందుకు నెక్కినది." తాళ్ల. సం. 9. 24.
  • చూ. ఎగా దిగా.

ఎగదీస్తే బ్రహ్మహత్య దిగదీస్తే గోహత్య

  • ఎటు పోయినా తప్పే అను పట్ల ఉపయోగించే పలుకుబడి.

ఎగదోయు

  • పురి ఎక్కించు.
  • "వాడు ముందే కొడుకుమీద మటమట లాడుతూ ఉంటే వీ డింకాస్త ఎగదోశాడు." వా.
  • చూ. ఎగబోయు.

ఎగనామం పెట్టు

  • మోసగించు; ఇవ్వక పోవు.