పుట:PadabhamdhaParijathamu.djvu/27

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది
  • అం అనిన ఢం అన నేరడు
అక్షరక్రమం తెలియదు, చదువేమాత్రం రాదు.

చూ. ఓ అంటే నా రాదు.

"అక్కట ! పొట్ట చించిన నొకక్షరమైనను రాదు, టెక్కులుం డక్కులు గాని య మ్మనిన ఢ మ్మన నేరడు." - శుక. 4.38.

  • అంకకా డగు : చలము పట్టువా డగు.

"కలహమున కంకకా డయి కాలు ద్రవ్వు." - ఆము. 5.84.

  • అంక చండాల మగు : నానా బీభత్స మగు; రోత పుట్టించున దగు.

"చాపకూ డటె వానిజన్మ మాఱడి వోవ నంక చండాల మైనది మతమ్ము." - నాయకు. 21 పు.

  • అంకపొంకాలుగ (జ్వరం కాయు) : విపరీతంగా...

"అంకపొంకాలుగా జ్వరం కాస్తూ ఉంది." - బ్రౌను.

  • అంకమాలికలు : దేవునిపేరు ఉన్న స్తోత్రములు.

"లీల నీశ్వరు నంకమాలిక ల్వాడుచో గీతభేదంబుల రీతు లెఱిగె". కుమా. 3.38.

  • అంకమ్మశోకాలు : వెఱ్ఱి యేడ్పులు.
  • అంకమ్మసివాలు : పూనకం వచ్చినట్లు వేయు గంతులు.
  • అంకవన్నె : రికాబు. గుఱ్ఱపుజీనుకు అటూ ఇటూ వ్రేలాడుతూ కాలు పెట్టుకొనుటకైన ఇనుప కడెము.
  • "అంకవన్నె యొకటి సాహిణి యవ్వల నూదిపట్ట దనయనుగు చెలికాడు కైదండ యొసగ" - ప్రభా. 2.38.

"ఇల బాదద్వయి రాయ నళ్కొసగు నెందో పాఱుచో నంకవన్నెలు రెండై." - ఆము. 2.27.

చూ. అంకెవన్నియ; అంకెవన్నె.

  • అంకాపొంకములు : కోపము; వైరము; తీవ్రము.

"అంకాపొంకాలు దరికొనంగ నిరంకుశ సాహస సమర్ధు డగు దశముఖుడున్." - రామా. 7.49.

"బెడిద మౌ శృంగార భూభత్సములకు నంకాపొంకములు." - కవిస. 1 ఆ.

"జ్వరము అంకాపొంకములుగా వచ్చినది." - శ.ర.

  • అంకిత మిచ్చు : కృతి యిచ్చు.