పుట:PadabhamdhaParijathamu.djvu/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


(2) అంకి.................అంకె

తిక్కన తన భారత భాగాన్ని హరి హర నధునకు అంకిత మిచ్చినాడు.వా.

 • అంకితము చేయు: కృతి ఇచ్చు.

పోతన తన భాగతాన్ని శ్రీరామ చందునకు అంకితం చేసి నాడు. నా.

 • అంకిత మొనర్చు: అంకిత మిచ్చు.

అంకిత మొనర్చు దెనుగునే ళ్ళరసి కూర్చి, గరిమతో నాంధ్ర నామ సంగ్రహమనంగ. అం.నా. దే. 3

 • అంకిలి నొక్కుకొని పోవు: నోట మాట రాక పోవు. కొత్త. 13
 • అంకిలి పడు: ఆగిపోవు.

అంకిలి పడి యడుపనులకు, సంకట పడుటదియు నొక విచారమె. భోజ. 6 అ. 376

 • అంకిలి పెట్టు: అడ్డు, ఆపు. వాడాయిత శక్తి నన్ను నిట నంకిలి పెట్టినయప్డు. భా.రా.సుం.71.
 • అంకిలి సేయు: వెనుదీయు. అంకిలి సేయక తూగ నోపినన్. భోజ. 7.17
 • అంకురారోపణము: ఆరంభము. ఏ శుభ కార్య ప్రారంభంలో నైనా పాలికా పూజ చేసి, అందులో నవ ధాన్యాలు చల్లి మొలక పోస్తారు. అందుపై వచ్చిన పలుకు బడి. ఈనాదు మన కృషికి అంకురారోపణం జరిగింది.;;
 • అంకురార్పణము: చూ. అంకురారోపణము. . చెల్వపు గ్రొవ్వు పెంపునంబొదరెడురంభకున్ సవతి పోరు గొంత చేసితి. కళా. 2.3
 • అంకుశమునకు రానిది: మాట విననిది. ఏనుగు అంకుశంతో పొడిస్తే మాట వింటుంది. అలా విననప్పుడు అంకుశానికి రానట్టు. లక్షణయా మాట విననిది. వశమునకు రానిది.
 • అంకెకు రాని: వశమునకు రాని. అంగన నమ్మ రాదు తనయంకెకురాని మహా బలాఢ్యు వే, భంగుల మాయ లొడ్డి చెలుపందలపెట్టు.
 • అంకెకు వచ్చు: దారికి వచ్చు. ఇల నాయంకెకు రావు ఇంద్రియములు నాపైనా కలసి నా మర్మములే కాడి పారీ గానీ. తాళ్ళ. సం 10.58
 • అంకెగొను: ఆక్రమించు, వశము చేసుకొను.