పుట:PadabhamdhaParijathamu.djvu/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎండ____ఎండు 243 ఎండు___ఎంత

ఎండలోని నీడ

  • శ్రమాపనోదకము.
  • తాళ్ల. సం. 11. 3 భా. 125.

ఎండవడు

  • 1. ఎండలో ప్రయాణము చేయు.
  • 2. ఎండ బాగా ఎక్కు.
  • "ఓ, తెరువరి యింత యెండవడి తేగల యట్టి వి కేమిభాగ్యముల్." గంధ. 66.
  • "దూరము వోయి యెండవడి దూపిలి వచ్చినప్రాణనాథునిన్, ద్వారకవాట గేహళులదాక నెదుర్కొని..." కాశీ. 2. 81.
  • "బాగా ఎండవడి పోయింది. చల్లబడి తర్వాత బయలుదేరొచ్చు." వా.
  • చూ. ఎండపడు.

ఎండవాలారునందాక

  • పొద్దు వాటాలేవరకూ అని నేటిరూపం. చల్లబడేవరకూ అనుట.
  • "ఎండ వాలారునందాక నిండుకొలని, తీరమున మఱ్ఱినీడ నిద్రించె నతడు." శివ. 3. 27.
  • చూ. పొద్దు వాటాలు.

ఎండుగులు

  • ఎండబోసిన ధాన్యము.
  • "కలనుపుటెండుగుల్ ద్రవిడకన్యలు ముంగిట గాచి." ఆము. 1. 75.
  • రూ. ఎండువులు.

ఎండుతెవులు

  • క్షయలాంటి వ్యాధి. శ. ర.

ఎండువులు

  • ఎండబోసిన ధాన్యము.
  • "ముంగిళ్ళ నెండువులు గానం బడవు." కేయూ. 3. 84.
  • రూ. ఎండుగులు.

ఎంత కాదు!

  • ఎం తైనా అగు ననుట.
  • "కాకతోడ జిత్తమెల్ల గరగి నీరై మించె, ఏకట నెవ్వరి కైన నెంత గాదు ప్రియము." తాళ్ల. సం. 12. 335.

ఎంతకు దెచ్చెను?

  • దీనివల్ల ఎంత అనర్థం కలిగింది అనుపట్ల ఉపయోగించే పలుకుబడి.
  • "ఎంతకు దెచ్చెనే సరసిజేక్షణ చెయ్దములు?" ఆము. 5. 77.
  • "నువ్వు ఆ రోజు ఏదో తమాషాకు అంటే ఆ మాట ఎంతకు తెచ్చిందో చూడు. అతనికీ నాకూ బద్ధ ద్వేషం యేర్పడింది." వా.

ఎంతకు నెత్తుకొంటివి ?

  • 1. ఎంతకు ఎక్కు పెట్టితివి, ఎంతకు దిగితివి. ఎంతకు తెగించావు ? ఎంతకు సిద్ధ మయ్యావు ? అన్న అర్థంలో ప్రయుక్త మవుతుంది.
  • "నా కొప్పనిబాస నిచ్చితి వహో యిటు లెంతకు నెత్తుకొంటి విం, కెప్పని కైన నమ్మదగునే." శుక. 1. 540.
  • "దయ యింత లేక యెంతకు నెత్తుకొంటి ర,క్కట మిమ్ము గన్నది గాక తల్లి." శుక. 4. 42.