పుట:PadabhamdhaParijathamu.djvu/268

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఎండ____ఎండ 242 ఎండ____ఎండ

యేర్పడినా ఏర్పడి ఉండవచ్చును.

 • "ఊతనీరు చెలదినేత మూటాయిటి, దూది యెండపసుపు దొఱ్ఱి యక్క, రంబు....మేను." ఆము. 6. 62.

ఎండబడు

 • ప్రొద్దెక్కు.
 • చూ. ఎండవడు.

ఎండబాఱు

 • ఎండిపోవు.
 • "పండబాఱినపొల మెండబాఱె." మను. 3. 129.

ఎండబెట్టు

 • ఎండలో ఉంచు.
 • "గోధుమలు ఎండబెట్టుదా మనుకుంటుంటే యింతలో వర్షం ముంచుకొని వచ్చింది." వా.

ఎండమఱువు

 • గొడుగు. సాంబ.

ఎండమావుల నీళ్లు

 • లేనివి. ఎండమావులు నీళ్లుగా కనిపించినా అందులో నీళ్లుండవు. తాళ్ల. సం. 7. 34.

ఎండమావులను పట్టగల

 • అసాధ్యకార్యము లొనర్ప గల, ఏమైనా చేయగల. నిరసనార్థద్యోతకంగా అనుమాట. కుమా. 8. 135,

ఎండమావులు

 • మృగతృష్ణ.
 • "ఎండమావులట్టుల సంపత్ప్రతతులు." భార. ఆది. 5. 159.
 • "ఎండమావులను దప్పు లేల దీరునోయమ్మ." తాళ్ల. సం. 4. 54.

ఎండమావుల కడగాళ్లు గట్టనేర్చు

 • అసాధ్య కార్యములను చేయ గలవా రనుటలో నిరసన సూచిస్తూ అనేమాట. ఎండమావులను కాళ్లు కట్టి వేయడం అసాధ్యం కదా!
 • పండిత. ప్రథ. పురా. పుట. 359.

ఎండలు నీడ లగు

 • సౌభాగ్యము చెడు.
 • "వండ వండ నట్లుగా వారి జూచి నవ్వేవు, యెండ లెల్లా నీడ లాయె నింక నేటిమాటలు." తాళ్ల. సం. 3. 557.
 • ఇక్కడ ఎండ ఆనందసూచకం. తద్విరుద్ధము నీడ.

ఎండలు నీడలు కాయు

 • మంచిరోజులు పోయి చెడు రోజులు వచ్చు.
 • "ఉండం బాసె నడవిలో నొకతె నేను, ఎండలు నీడలు కాసె నేమి సేతురా!" తాళ్ల. సం. 3. 663.
 • చూ. ఎండలు నీడ లగు.

ఎండ లేనినాటి నీడ

 • ఉండ దనుట.
 • తాళ్ల. సం. 12. 55.