ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఊత____ఊద 231 ఊద____ఊదు
ఊతనీరు
- అశాశ్వతము; భంగురము. ఎత్తిపోయునీరు కొంచమే ఉంటుంది. త్వరగా ఎండిపోతుంది అనుటపై ఏర్పడినది. అశాశ్వతము అని భావార్థం నిలిచినది.
- "ఊతనీరు, చెలదిసేత, మూటాయిటి దూది, యెండపసుపు, దొఱ్ఱి యక్కరంబు మేను." ఆము. 6. 62.
ఊత యొసగు
- ఊత యిచ్చు.
- "రామునిడించి కరం బూత యొసగి." వర. రా. అయో. పు. 256. పం. 1.
ఊదజెప్పు
- నొక్కి చెప్పు.
- "సంస్కృతశబ్ద మూద జెప్పిన నవి దర్భముం డ్లనుచు బెట్టరు వీనుల." సంహా. 1.32.
ఊదబడి పోవు
- తఱుమబడి పాఱిపోవు. ఊదుకొనిపోవు (తఱుముకొనిపోవు) అన్న రూపంలో నేడీ పలుకుబడి పశ్చమాంధ్రంలో వినవస్తుంది.
- "తలతో నూదబడి పోయె ధనదుడు కృతి యై." కవిక. 2. 122.
ఊదబొడ్డు
- పైకి ఉబికి ఉన్న బొడ్డు
ఊదరగొట్టు
- ఏదో ఒకటి చెయ్య మని పోరు. ఊపి రాడనీయకుండా.
- "అక్కడికి వెళ్లేసరికి వాడు అదేపనిగా తనగొడ వంతా చెప్పుకొని ఊదరకొట్టి వదిలి పెట్టాడు." వా.
ఊదర పెట్టు
- పందికొక్కులూ మొదలయిన వాని కలుగులలో పొగపెట్టు. అలా పొగ పెడితే అవి ఊపిరి తిప్పుకో లేక బయటికి వస్తాయి. అప్పుడు వాటిని చంపుతారు లక్షణయా ఊపిరి తిప్పుకోనీయకుండా వేధించు.
- "వాడు పొద్దున్నించీ ఒకటే ఊదరపెడుతున్నాడు ఊరికి పోదామని." వా.
- చూ. ఊదరకొట్టు.
ఊదర లిడు
- "ఉరుధూమతతుల బిట్టూదర లిడిన, పరుసున దొఱటల బాములు నుడియ." గౌర. హరిశ్చ. పూ. 2238.
- చూ. ఊదరపెట్టు.
ఊది పిఱింది త్రాడగు
- వెంట నుండు. వెనుకకు కట్టుకొని యుండు త్రాడు వెంట వచ్చినట్లు.
- "ఏదెస దొలంగినను నూది పిఱింది త్రాడై యాదిగొని." ఉ. హరి. 4. 29.
ఊదుకడ్డీ
- సాంబ్రాణివత్తి.
- "సాయంకాలం రెండు ఊదుకడ్డీలు ముట్టిస్తే మంచిది." వా.
- చూ. ఊదువత్తి.