ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఊడ_____ఊడి 230 ఊడు____ఊత
- "పాఱు తెంచిన యొడ్డీని పెనులావు లూడదన్ని." జైమి. 1. 45.
- "ముందుపండ్లు నాలుగూ ఊడదన్ని పంపిస్తే పోతుంది." వా.
- చూ. పండ్లూడదన్ను.
ఊడనిబాడు
- ఊరు వదలిపోవు, పాఱిపోవు.
- "ఒకనాటిరాత్రి పడుపడు,కకు జెప్పక యిల్లు వెడలి గాఢతరతమో, నికరము తన తగుతోడుగ, నొకరుడు పేరడనవి త్రోవ నూడనిబాడెన్." పాండు. 3. 49.
- "అక్కాంతామణి నెచ్చెలు, లొక్కొక పని పేరు చెప్పి యూడనిబాడన్." కవిజన. 3. 98.
- "అయ్యురగము లెల్ల నల్దెసల నూడని బాడిన." ఉత్త. హరి. 6. 239.
ఊడబొడుచు
- ఉద్ధరించు వంటిది. వాడు చేసింది మహా యేమిటి అన్న అర్థంలో ఉపయోగిస్తారు.
- "వాడు ఊడబొడిచింది ఏముంది యిందులో?" వా.
ఊడిన నాగ లైన
- మూలబడిన, సరి యైనస్థితిలో లేని.
- "ఊడిననాగ లైనపతి కున్నవి లేనివి నచ్చబల్కి." రుద్రమ. 19 పు.
ఊడిపడు
- హఠాత్తుగా వచ్చు./
- "వాడు ఎక్కడనుండో ఆవేళకు సరిగ్ఘా ఊడిపడ్డాడు." వా.
ఊడుకొన జేయు
- పాఱునట్లు చేయు.
- "ఊడుకొన జేసి వే ఱొక్క దిక్కు తెరువుగా." భాస్క. అర. 2. 126.
ఊడుగవిత్తనంవంటి
- ఎప్పుడూ వదలని. ఊడుగువిత్తనా లన్నీ తిరిగీ ఉరుమురిమితే ఊడుగుచెట్టు మొదలును కరుచుకొంటాయి అని ఒక ప్రథ. దానినిబట్టి వచ్చిన పలుకుబడి.
ఊడ్చి పెట్టు
- ఉన్న దంతా దోచిపెట్టు.
- "ఆవిడ పుట్టింటికే ఉన్నదంతా ఊడ్చి పెట్టింది. ఇంక తన కొడుకుల కేం మిగులుతుంది?" వా.
ఊడ్చి పెట్టుకొని పోవు
- సర్వం పోవు.
- "ఉన్న దంతా ఊడ్చిపెట్టుకొని పోయే సరికి వాళ్లు ఆ ఊరు వదిలి వేరే ఊరు పోవలసి వచ్చింది." వా.
ఊతకోల
- ఆధారము; తోడు; చేయూను కఱ్ఱ.
- "అందునకు నూతకోలగా నకట యొకని, నైన నిలుపక..." భార. స్త్రీ. 1. 170.
ఊతగొను
- ఆధారముగా చేసికొను.
- "ఒండొరుల కేలు దమ్ముల నూత గొనుచు." పారి. 4. 27.