ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఊక___ఊకొ 228
ఊకదంపు పాట
- వట్టి వాగాడంబర మనుట.
- చూ. ఊకదంపు.
ఊకబంతి
- చెండుమల్లె (బంతి) జాతిలో ఒక రకం.
ఊకర లిచ్చు
- ఊకొట్టు.
- "వెడ యేడ్చు నంతన యుడుగునుగ్గడంగు, నూకర లిచ్చు నాలకించు." భోజ. 1. 176.
- చిన్న పిల్లల విషయంలోనే యిది ఉపయోగిస్తారు.
ఊకరలు గొట్టు
- హుంకరించు.
- "ఊకరల్ గొట్టుచు నుత్తలపడుచు." బస. 7. 868.
ఊకరలు వెట్టు
- చూ. ఊకరలు గొట్టు.
ఊకర ల్వెట్టు
- హుంకరించు.
- "ఊకరల్వెట్టుచు నుఱవడింపుచును." బస. 5. 139. పు.
- (ఎద్దు ఇక్కడ ప్రసక్తం).
- చూ. ఊకరలు గొట్టు.
ఊకొట్టు
- 1. అంగూకరించు; అంగీకారము తెలుపు.
- "మొనయక యూకొట్టి ంరొక్కుచునున్న." గౌ. హరి. ప్రథ. పంక్తి. 1325.
- రాయలసీమలో వీటికే పిసుకుళ్లని పేరు.
ఊచముట్టుగా
- పూర్తిగా, నిశ్శేషముగా.
- "ఊచముట్టుగ గీము లాహుతి గొనంగ." రామా. 6. 250.
- "ఊచముట్టుగ నిలు దోచి యుఱికి చనుట." పాండు. 3. 50.
ఊచముట్టుగొను
- చంపు.
- "నీ తమ్ము గుఱ్ఱల నూచముట్టుగొనియె నేవిధి." భార. శల్య. 1. 28.
ఊచినకఱ్ఱ వంపని
- బలహీనురా లయిన. సుకుమారురా లయిన. సన్ననికఱ్ఱను కూడా వంచలేని దనుటపై వచ్చిన పలుకుబడి.
- "ఊచినకఱ్ఱ వంపనిపయోరుహలోచన మింట మంటలం, బూచినబాణజాలమున." ఉ. హరి. 1. 163.
ఊటచెలమ
- తఱుగనిది; చెలమలో నీరు వినియోగ మయ్యేకొద్దీ తిరిగీ ఊఱుతూనే ఉంటుంది. తాళ్ల. సం. 11. 122.
ఊటాడించు
- గట్టిగా కదలించు.
- "మదాళిమాలికల నూటాడించు వేణీ రుచుల్." విజ. 2. 16.
ఊడదన్ను
- పోగొట్టు, పోవునట్లు తన్ను.