పుట:PadabhamdhaParijathamu.djvu/233

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్త_____ఉత్త 207 ఉత్త_____ఉత్త

ఉత్తమరతి

  • రతిభేదము. కుమా. 9. 152.

ఉత్తరకుమారప్రజ్ఞలు

  • వట్టి డంబాలు. భారంలో ఉత్తరుడు తానే పశువులను మళ్లించెద నని వెళ్లి, తుదకు కౌరవసేనను చూడగనే వణకిపోయి వెనుకకు పారిపోవ జూచాడు అనుకథపై యేర్పడిన పలుకుబడి.
  • "ఈ ఉత్తరకుమారప్రజ్ఞల కేం చాలానే చెప్పవచ్చు. అసలు పోలీసులు కనిపించగానే పారిపోయేవాడివి. నీకు సత్యాగ్రహ మేమిట్రా." వా.

ఉత్తరక్రియలు

  • అపరక్రియలు. చనిపోయిన తరువాత చేసే కర్మకలాపం.
  • "అతనంత బాగా బతికాడా! కడకు ఉత్తరక్రియలకు కొడుకు తిరిపె మెత్తవలసి వచ్చింది." వా.

ఉత్తరజందెము

  • చూ. ఉత్తరజన్నిదము.

ఉత్తరజన్నిదము

  • బ్రహ్మచారి మూడుపోగులతోడి ఒక ముడి, గృహస్థు అలాంటివి రెండు వేసుకోవా లని విధి. మూడవది ఉత్తరీయార్థం వేసుకుంటారు. అది ఉత్తరజందెం.
  • "ఇభ కుంభమణు లెడనెడ గూర్చు గురివెంద, జమలియుత్తరజన్నిదములు దనర." రావి. 3. 34.

ఉత్తరడొక్కరము

  • కుస్తీపట్లలో ఒకటి.

ఉత్తరమీమాంస

  • మీమాంసాశాస్త్రం రెండుభాగాలు - పూర్వమీమాంస, ఉత్తరమీమాంస. జైమినికృత మైన పూర్వమీమాంస కర్మజిజ్ఞాసకు చెందినది. వ్యాసకృత మైనఉత్తర మీమాంస బ్రహ్మజిజ్ఞాసకు చెందినది.

ఉత్తరవయస్సు

  • వృద్ధాప్యం.

ఉత్తరవస్త్రం

  • చూ. ఉత్తరవాసం.

ఉత్తరవాసం

  • పైపంచ, అంగవస్త్రం.
  • "వెలిపట్టు పుట్ట ముత్తరవాసముగ ధరించి." నైష. 8. 108.
  • చూ. ఉత్తరవస్త్రం.

ఉత్తరాసంగము

  • చూ. ఉత్తరవాసం.

ఉత్తరాషాడ పూర్వాషాడ అగు

  • వాంతులు భేదులు అగు, ఎక్కువ భయము కలుగు,