పుట:PadabhamdhaParijathamu.djvu/232

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉడ్డా____ఉడ్డు 206 ఉడ్డు____ఉత్త

వచ్చి ఆఖరున ఒకేపూజ నిలిచి గోపురాకారంగా తయారవుతుంది. వీటిని నేటికీ రాయలసీమ పల్లెపట్టులలో కొందఱు ధరిస్తారు. బుగడలనే అంటారు. వావిళ్లలో చంపసరులు, నాలుగుపేటలు గల హారవిశేషం అనడం సరికాదు.

  • ఉడ్డలవలె పూజలను ఉంచి అతుకుటతో ఉడ్డబుగడలైనవి.
  • "ఉడ్డబుగడలు కట్లసరులు." గంస.

ఉడ్డాడించు

  • క్షోభపెట్టు, కలతపెట్టు.
  • "వాపోచున్ క్షుధ గుంది చాల సుతు లవ్వా! బువ్వ బువ్వంచు స,ల్లాపెన్ జీర్ణపటాపకర్షముల నుడ్డాడింపగా జూచి." మల్ల. భూ. వై. 21.
  • చిత్తూరుప్రాంతంలో ఉడకాడించు అనేరూపంలో విశేషంగా వినవస్తుంది.
  • "ఈ పిల్ల లంతా నన్ను ఊరికే ఉడకాడిస్తున్నారు." వా.

ఉడ్డాడు

  • కలగు, క్షోభించు.
  • చూ. ఉడ్డాడించు.

ఉడ్డు కుడుచు

  • కళవళము చెందు.
  • "ఉదవాసక్లేశంబున నుడ్డుకుడిచి వెలుపటికిం బుట మెగయుచు." పాండు. 3. 150.
  • చూ. ఉడ్డు గుడుచు.

ఉడ్డుగుడుచు

  • ఉక్కిరి బిక్కిరి యగు.
  • "బేతాళములు నీళ్ళ వ్రేసి త్రొక్కగ బాసి, యుదు టెల్ల బెడబాసి యుడ్డుగుడిచె." దశా. 2. 409.

ఉతికి ఆరవేయు

  • ఎదుటివాని లోపముల నన్నిటినీ యేకరువుపెట్టి విడుచు; చితకతన్ను.
  • "వాడు రానీ చెప్తా, ఉతికి ఆరవేస్తాను." వా.
  • "నాలుగు ఉతికి ఆరవేస్తే గానీ వాడు మాట వినడు." వా.

ఉత్తచేతుల మూరలు వేయు

  • ఏమీ లేకనే గొప్పలకు పోవు. బట్టలు లేకనే మూరవేయడం, యోగ్యత లేకనే హెచ్చులకు పోవడంగా ఇట సూచన.
  • "వాడు ఎప్పుడూ ఉత్తచేతులతో మూరలు వేస్తుంటాడు." వా.

ఉత్తపుణ్యానికి

  • వృథాగా. కొత్త. 16.
  • "ఉత్త పుణ్యానికి పదిరూపాయలు పోగొట్టుకున్నాను. వాడు జోస్యం చెప్పిందీ లేదు. అది అయ్యిందీ లేదు." వా.