పుట:PadabhamdhaParijathamu.djvu/231

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ఉడు______ఉడ్డ 205 ఉడ్డ______ఉడ్డ

వాడుకలో 'ఉడతాభక్తిగా.'

 • "నేనూ ఏదో ఉడతాభక్తిగా నా చేతనైనసాయం చేస్తాను." వా.
 • చూ. ఉడతాభక్తిగా.

ఉడుదేనె లగు

 • మధుహీనము లగు; తేనె లుడుగు.
 • "కడివోవ నళు లానగా రేకు లెడలి, యుడుదేనె లైన పర్యుషితపుష్పములు."
 • పండితా. పురా. 89. పు.

ఉడుపకుక్క

 • వేటకుక్క.
 • "ఉడుపకుక్కలు కుందేళ్ళ నుందరువుల నుడుముల గ్రహింప." మను. 4. 51.

ఉడుబోతు

 • విరక్తుడు.
 • బ్రౌను.

ఉడుముపట్టు

 • గట్టిపట్టు. ఉడుము నేల కరుచుకున్నదంటే గొలుసులువేసి లాగినా రాదు. అందుపై యేర్పడినది.
 • "వాడిది ఉడుముపట్టు. చచ్చినా వదలడు." వా.
 • చూ. భల్లూకపుపట్టు.

ఉడ్డతిత్తులు

 • గచ్చకాయల తిత్తులు. మూడు గచ్చ కాయలను పొయిగుండ్లవలె పెట్టి, వానిమీద ఒక గచ్చకాయ పెట్టి వానిని మరొక గచ్చకాయతో కొట్టడం అలవాటు. ఇదే గచ్చకాయలాట అయినది. లక్షణయా ఉడ్డలు గచ్చకాయ లయినవి. ఆపెట్టు పద్ధతినిబట్టి వచ్చినదే ఉడ్డ = నాలుగు అన్న అర్థము. ఈ 'ఉడ్డతిత్తుల'కు అడ్డతిత్తు లని ముద్రితప్రతులలో ఇచ్చిన పాఠం సరి కాదు.
 • "మెత్తగ నూఱినచుట్టుం, గత్తిర మధుకైటభోరు కంఠము లలనా, డొత్తిన హత్తిన చెన్నుం, దిత్తుల క్రియ దొడల నుడ్డతిత్తులువ్రేలన్." పాండు. 2. 33.
 • చూ. ఉడ్డపొడలు.

ఉడ్డపల్లంచి

 • ఆడపిల్లల ఆట.

ఉడ్డపొడలు

 • గచ్చకాయ తిత్తులు.
 • "పెరుగు నుడ్డపొడలున్." పాండు. 5. 56.
 • చూ. ఉడ్డతిత్తులు.

ఉడ్డబుగడలు

 • చెవి పై వేపు రంధ్రం వేసి పెట్టుకొనే ఆభరణం. నడుమ ఒక గొట్టం, పైనా క్రిందా నాలుగు పూజలను సమానంగా ఉంచి దానిపైన ఒక పూజను ఉంచి అతికి చేస్తారు. ఈ పూజల సంఖ్యను అలా పెంచుకొని పోవడం కూడాకద్దు. అడుగున ఎక్కువ సంఖ్యా, క్రమంగా తగ్గుతూ