పుట:PadabhamdhaParijathamu.djvu/234

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉత్త____ఉత్త 208 ఉత్త_____ఉద

పూర్వం, ఉత్తరం అన్న శబ్దసామ్యంతో యేర్పడినట్లు కనబడుతుంది. అటూ ఇటూ అనుట.

  • "వాణ్ణి చూచేసరికి వీనికి ఉత్తరాషాడ పూర్వాషాడ అయింది." వా.

ఉత్తరించు తములపాకు నిక్కెడుక్రియ

  • ఆకుతోటలో, బొటనవ్రేలి గోటికి ఒక ఇనుపగోటిని తగిలించుకొని తమలపాకులను ఠకీ మని కత్తిరిస్తారు. అప్పుడది యెగసి పడుతుంది.
  • "ఉత్తరించు తములపాకు నిక్కెడుక్రియ దాటె నిఱ్ఱి." ఉ. హరి. 4. 28.

ఉత్తరీయము

  • పైపంచ, అంగవస్త్రము.
  • చూ. ఉత్తరవాసం.

ఉత్తరువు లిచ్చు

  • ఆజ్ఞాపించు.
  • "తరువు లాకసము కుత్తరువు లిచ్చు." యామున. విజ. 4. 229.

ఉత్తరోత్తరా

  • ముందుముందుకు, కాలక్రమేణ.
  • "ఇప్పడు రాజీ చేసుకోవడంవల్ల ఉత్తరోత్తరా మీకు చాలా లాభాలు ఉన్నవి."
  • చూ. ఉత్తరోత్రా.

ఉత్తరోత్తరాభివృద్ధి

  • క్రమాభివృద్ధి.
  • "పొత్త మిటు సేయ నీ కుత్తరోత్తరాభివృద్ధియని..." ఆము. 17.
  • "ఉత్తరోత్తర మభివృద్ధి నొందుచుండు." కాశీ. 2. 52.

ఉత్తరోత్రా

  • వాడుకలో ఈ రూపం కనిపిస్తుంది.
  • చూ.ఉత్తరోత్తరా.

ఉత్తలపడు

  • తహతహపడు.
  • "చిత్తం బుత్తలపడియెడు." సింహా. 1. 62.

ఉత్సవవిగ్రహము

  • అలంకారవిద్యార్థి వంటిది. ఊరేగింపునకుమాత్రం పనికివచ్చేది; మూలవిరాట్టు కాదు.
  • "వాడు వట్టి ఉత్సవవిగ్రహం; లోపల సత్తాసార మేం లేదు." వా.

ఉదకమాడు

  • స్నానము చేయు.
  • "ఒక్కప్రొద్దుండి సెలయేట నుదకమాడి." కాశీ. 3. 37.
  • "మహారయమున గొలవ నుదక మాడగ బోవన్.: కా. మా. 3. 208

ఉదపానమండూకము

  • నీటిలోని కప్ప.
  • చూ. కూపస్థమండూకము.

ఉదయరాగపట్టులు

  • వస్త్రభేదము.
  • ద్వాద. 3. 206.

ఉదరపోషకులు

  • పొట్ట నింపుకొనువారు. దూషణలోనే ఉపయుక్తం.
  • పండితా. ప్రథ. పురా. పుట. 343.