పుట:PadabhamdhaParijathamu.djvu/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉక్కు____ఉక్కో 197 ఉక్రో____ఉగ్గు

డొండ కడంగుచు నుజ్జ్వల, చండ స్థితి మొప్పి రపుడు జగతీనాథా." భార. భీష్మ 1. 138.

  • 2. పరాక్రమించు.
  • "అక్కిరీటి సైన్యంబు లెక్కగొనక యుక్కుమిగిలి యక్క జంబు గాక, జిక్కువడం బెక్కు నారసంబులు..."
  • జైమి. 5. 20.

ఉక్కుమీఱు

  • చేవమీఱు.
  • భాగ. 6. స్కం. 260.
  • చూ. ఉక్కుమిగులు.

ఉక్కుమెఱయు

  • "అవ్విభుండు వాని నెల్ల వింటవడి బాఱ జడుపుచు లెక్క సేయకుండె నుక్కు మెఱసి."
  • భాస్కర. ఆర. 1. 228.
  • చూ. ఉక్కుమీఱు.

ఉక్కు మురిసినట్లు

  • ఉక్కు కరగినట్లు.
  • "చిక్కువడి యుక్కు మురిసినట్లు సమసిన." భార. ద్రోణ. 3. 394.

ఉక్కువడు

  • దుర్బలు డగు; దీను డగు.
  • "ఉక్కువడి యుండె బహుకాల మొప్పు దఱిగి, విగతలక్ష్మివిలాసుడై వేల్పుఱేడు." హర. 6. 30.

ఉక్కెక్కు

  • గట్టిపడు.
  • "పిక్క లుక్కెక్కగ ద్రొక్కి నిల్చి." కాళ. 4. 174.

ఉక్కోలుగా

  • విపరీతంగా.
  • "విసరె నుక్కోలుగా విషమవాయువులు." వర. రా. బా. పు. 229. పంక్తి 13.

ఉక్రోషం

  • ఉడుకుబోతుతనము.
  • "దాన్ని ఏమనకురా, అది వట్టి ఉక్రోషంమనిషి." వా.

ఉగాది

  • సంవత్సరాది.
  • "ఈ ఉగాదికి కొత్తబట్టలు కొనాలంటే కూడా డబ్బు లేదు." వా.

ఉగ్గగట్టు

  • బిగించి కట్టు.
  • "నెన్నడు ముగ్గంగట్టి." వి. పు. 7. 135.

ఉగ్గడు వగు

  • ఎక్కు వగు, అధిక మగు.
  • "ఉగ్గడు వగు తేజంబున." భార. ద్రోణ. 5. 195.

ఉగ్గబట్టు

  • ఆహారాదులను విసర్జించు.
  • "వాడు పదిరోజులుగా కూడూ నీరూ ఉగ్గవట్టాడు." వా.
  • చూ. ఉక్కపట్టు.

ఉగ్రము వచ్చు

  • 1. ఒడలు మరిచేటంత కోపమో ఆవేశమో వచ్చు.
  • "వానికి ఆమాట వినేసరికి ఉగ్రం వచ్చింది." వా.
  • 2. దేవుడో దయ్యమో ఆవేశించు.
  • "వాడు పీ రెత్తుకొనేసరికి ఉగ్రం వస్తుంది." వా.

ఉగ్గుతో పెట్టినవిద్య

  • చిన్నతనంనుంచీ వచ్చిన