పుట:PadabhamdhaParijathamu.djvu/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉక్కి____ఉక్కు 196 ఉక్కు____ఉక్కు

రావడం చేత ఉక్కిరిబిక్కిరైపోయింది."

  • "ఈ పనితో ఉక్కిరిబిక్కిరి అయిపోతూ ఉంది." వా.

ఉక్కివ మాడు

  • మేల మాడు.
  • "క్రొమ్మెఱుంగుతో నుక్కివ మాడు మేనిపస." క్రీడా. పు. 87.

ఉక్కీడు

  • మూర్ఖుడు, దుష్టుడు.
  • "ఉక్కీ లయి నేర్పులేక." నిర్వ. 3. 11.
  • "ఉక్కీనిమనంబు కీడు పరికించునె." భార. విరా. 3. 7.

ఉక్కు గరచి చేయు

  • ఉక్కుతో చేయు.
  • అంత కఠిన మైన దనుట.
  • "కౌసల్యహృదయ మక్కట, యుక్కు గరచి చేసినారొ?"
  • వర. రా. అయో. పు. 420. పంక్తి. 17.

ఉక్కుతునక

  • ఉక్కుముక్కవంటి బలిష్ఠుడు. ఉక్కు చాలా గట్టి లోహమనుట ప్రసిద్ధము.
  • చూ. ఉక్కుతునియ.

ఉక్కుతున్క

  • వీరుడు.
  • "...గాళకు లాపురీభట శిఖామణు లెక్కటి యుక్కు తున్కలు..." విజ. 1. 75.
  • చూ. ఉక్కుతునక.

ఉక్కుతునియ

  • బలశాలి, శూరుడు.
  • "ద్రౌపదేయుడు నాసుభద్రాసుతుండు నుక్కుతునియలు గారె." భార. ఉద్యో. 176.
  • చూ. ఉక్కుతునక.

ఉక్కున పెనచిన ట్లుండు

  • దిట్టముగా ఉండు. ఉక్కు గుండువలె అనుట.
  • "ఉక్కున బెనచినట్లున్నాడు వీడు." గౌ. హరి. ద్వితీ. పంక్తి 1504.

ఉక్కునీరు

  • ఉక్కు కరిగించగా ఏర్పడిన ద్రవము.
  • "ఉక్కునీరు వోతురు." భాగ. 5. 2.

ఉక్కుపొడి రాల్చు

  • నిప్పులు గ్రక్కు వంటిది. క్రోధాతిరేకమును సూచించే పలుకుబడి.
  • "ఉక్కుపొడి రాల రోషంబు." విజయ. 3. 151.

ఉక్కు మడగు

  • బలము చెడు.
  • "ఉఱక విరోధి సైన్యముల నుక్కుమడంగంగ నుల్లసద్గతిం, బఱప..." భార. విరా. 5. 61.

ఉక్కుమడచు

  • ఉక్కు మడగునట్లు చేయు.

ఉక్కుమడుగు

  • పరాక్రమ ముడుగు
  • "మడిసియు జడిసియు జిక్కువడియు నుక్కు మడిగియు." భార. ద్రోణ. 5. 92.

ఉక్కుమిగులు

  • 1. చేవ గల్గు; అతిశయించు.
  • "రెండు బలంబుల వారలు, నొండొరువులకంటె జాల నుక్కుమిగిలి యొం,