పుట:PadabhamdhaParijathamu.djvu/221

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉంపు_____ఉక్క 195 ఉక్క____ఉక్కి

ఉంపుడుకత్తె

  • ఉంచుకొన్న స్త్రీ.

ఉక్కడగు

  • బలము కోలుపోవు.
  • "ఉక్కడగెన్ మగధేశ సైన్యముల్." భార. సభా. 1. 213.

ఉక్కడచు

  • చంపు, పొగ రడచు; బలహీన పఱుచు.
  • "మార్కొను వీరయోధుల బెక్కండ్ర నుక్కడంప." జైమి. 6. 132.

ఉక్కడీడు

  • బలశాలి.
  • "ఉక్కడీ డయి యేతెంచె నుక్కు మిగిలి...మరుడు." నైష. 7. 41.

ఉక్కణగు

  • బలము తఱిగిపోవు.
  • చూ. ఉక్కడగు.

ఉక్కణచు

  • పొగరడచు.
  • "రక్కసు నాయోధనమున నుక్కణంచి." రుక్మాం. 575.
  • చూ. ఉక్కడచు.

ఉక్కపట్టు

  • చేమట పోయు; గాలి లేక వేడి యెక్కువై అనుట.
  • "ఈరోజు చాలా ఉక్కపడుతూ ఉంది." వా.
  • "అక్కడ ఉక్క పట్టుతూ ఉండడం చేత ఈ రోజు ఇక్కడ పండుకొన్నాను." వా.
  • చూ. ఉక్క పెట్టు.

ఉక్కపెట్టు

  • చెమట పట్టు.
  • "ఈరోజంతా ఉక్క పెడుతూ ఉన్నది." వా.
  • చూ. ఉక్కపట్టు.

ఉక్కపోయు

  • చెమటపట్టు.
  • చూ. ఉక్క పెట్టు.

ఉక్కబట్టు

  • 1. ఉగ్గబట్టు; మూసివేయు.
  • "ఒకవేళ వానల నుపహతి నొందించు నొకవేళ రంధ్రంబు లుక్కబట్టు." భాగ. 7. 199.
  • 2. ఆహారాదులను విసర్జించు.
  • "విడుతు బ్రాణము, నీకై కూ డుక్కబట్టి నీలగ్రీవా!" కాళ. 3. 101.
  • చూ. ఉగ్గబట్టు.

ఉక్కఱు

  • బలహీన పడు.
  • "ఉక్కఱి యిట్లు మధ్యము మహోగ్ర శరంబుల దాక నోర్వక." భార. అర. 4. 12.

ఉక్కళ ముండు

  • సైన్యము విడిసినచోట, బయటివారి రాకను కనిపెట్టుటకై కావలి యుండు.
  • "కొండప్రక్కల నుక్కళ ముండు వేల్పు, తండముల జెండి యెక్కి యక్కొండయందు." దశా. 2. 57.

ఉక్కిరి బిక్కి రగు

  • ఊపిరాడక విలవిలలాడు; తీరిక లేకపోవు.
  • "ఈ రోజే ఇన్నిపనులూ చేయవలసి