పుట:PadabhamdhaParijathamu.djvu/224

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉగ్గు____ఉచ్చ 198 ఉచ్చ____ఉచ్చా

విద్య. ఉగ్గుపెట్టు నాటినుంచీ వచ్చిన దనుట.

  • "వానికి నయంగా మాట్లాడి బుట్టలో వేసుకోవడం ఉగ్గుతో పెట్టిన విద్య." వా.
  • చూ. వెన్నతో పెట్టినవిద్య.

ఉగ్గుపెట్టు

  • చంటిపిల్లలకు చిట్టాముదము. చనుబాలు కలిపి రంగరించి అది చిక్కనిపాలవలె కాగా (అదే ఉగ్గు) దానిని పెట్టు.
  • "వా పోయి వా పోయి పసివాడి యాకట, బెగడె గా యని యుగ్గువెట్టి వెట్టి." పాండు. 3. 156.

ఉగ్గువడు

  • క్షీణించు.
  • "తన ధృతి, యుగ్గువడన్ వేపితామహునికడ కరిగెన్." కకు. 1. 209.

ఉచు క్కను

  • తిరస్కరించు.
  • "ముఖాబ్జకాంతితో జుక్కలరాజునైనను నుచు క్కనువాడు." యామున. విజ. 4. 129.

ఉచ్చగిత్త

  • స్త్రీలోలుడు.
  • "వాడా వట్టి ఉచ్చగిత్త. చీరకొంగు కనబడితే చాలు వెంటపడతాడు." వా.

ఉచ్చచెలమ

  • విరక్తి కల్గించుటకై జుగుప్సార్థంలో యోగులూ, జ్ఞానులూ యోనికి పెట్టిన పేరు.
  • "ఉచ్చ చెలమ గోరి యున్నది జగమెల్ల." వేమన. 1029.

ఉచ్చ దివిటీగా వెలుగు

  • బాగా మాట సాగు. వాని మాట కెదురు లేకుండా అధికారం చలాయిస్తున్నాడు అనుపట్ల ఉపయోగించేపలుకుబడి.
  • "ఆ రెడ్డిపే రంటే ఆజిల్లా అంతా హడలు. వాని ఉచ్చ దివిటీగా వెలుగుతున్న దంటే నమ్ము." వా.

ఉచ్చనీచములు

  • హెచ్చుతక్కువలు.
  • "కుడువంజొచ్చును బ్రాహ్మణార్థములు పెక్కుల్ రాజకీయార్థముల్, నడుపం జూచును యాజ్ఞవల్క్యుండు ధరన్ నానోచ్చనీచంబులం, దెడ లేక న్నటి యించు గాలముకొలదిం బోవు..."
  • తెలుగునాడు. పు. 41.

ఉచ్చపోయు

  • మూత్రవిసర్జన చేయు.

ఉచ్చమల్లి

  • ఒకతిట్టు; నగ్నస్త్రీ.
  • "ఉచ్చమల్లి యయ్యింతితల్లి." శుక. 3. 18.

ఉచ్చరతి

  • రతివిశేషములలో ఒకటి.
  • కుమా. 9. 152.

ఉచ్చాటన

  • స్థానభ్రంశము; తఱిమివేత. మంత్రపరిభాష. దయ్యాలను, భూతాలను మంత్రాలతో వెడలగొట్టుటపై వచ్చినపలుకుబడి.