ఈ పుట అచ్చుదిద్దబడ్డది
ఈడు____ఈడు 183 ఈడు_____ఈడే
నెందును నిలువక నీడుబండాడు, నింద్రియంబుల గెల్వ నెవ్వరివశము." ప్రభులిం. 18. 106. ఈడు మీఱు
- రజస్వల యగు.
- "ఈ డెఱుంగనిచేడియ యీడు మీఱె." రాధికా. 1. 69.
ఈడుముంత
- పాలముంత. గొల్లవాళ్లు దీనిని ఉపయోగిస్తారు.
- ఈడువచ్చు
- 1. సమాన మగు; పోలు.
- "దాడిమీఫల బీజాదులు నద్రిజావ యవసౌభాగ్యంబుతో నీడు రాగలవో లేవొ." కాళ. 1. 100.
- 2. వయసు వచ్చు.
- "ఈడు వచ్చినపిల్లను ఇంట్లో ఎన్నాళ్లు పెట్టుకొంటాము." వా.
ఈడువారు
- 1. సమానులు.
- "నా యీడువారు కారు." వరాహ. 6.33.
- సమవయస్కులు.
- "రాగమంజరియన నొప్పు రాజసుతయు దాను నొక యీడు కాగ." విక్ర. 1. 116.
- "వా ళ్లిద్దరూ ఒక యీడువారు." వా.
ఈడు వెట్టు
- సమానము చేయు; పోల్చు.
- "చక్కని కన్నుల సూర్యచంద్రులుగా గలవాడు, ఎక్కుడుగా కిందఱిలో నీడు వెట్టేదా?" తాళ్ల. సం. 9. 56.
ఈడుసేయు
- పోల్చు.
- "దోసము గాదె యియ్యతివతో బెఱ తొయ్యలి నీడుసేసినన్." కవిక. 3. 28.
ఈడేరి మొనకు వచ్చు
- పెరిగి పెద్ద యగు.
"పుట్టినప్పుడు నిన్ను భూసురు లెల్ల
బట్టభద్రుం డని పలికిరి గాని
ముందర నీడేరి మొనకు రా వనుచు
నెందుకోసము నిర్ణయింపలే రైరి."
సారం. ద్వి. 2. 517.
ఈడేఱించు
- సఫల మగునట్లు చేయు.
- "సోమతీర్థ మహేశ్వరు డిట, నా ప్రయాస మీడేఱించెన్." శకుం. 4. 24.
ఈడేఱు
- 1. రజస్వల యగు.
- "ఇ, ట్లీడేఱి కట్టుదప్పిన, చేడియ కిక నైన బెండ్లి సేయం దగదే." యయాతి. 3. 100.
- 2. సఫల మగు, కృతార్థుడగు.
- "నీ కథలు విని విని మే మీడేరితిమి." తాళ్ల. సం. 6. 161.
ఈడేఱుచు
- కడతేర్చు.
- "మమ్ము నొక చొప్పున దు:స్థితి నొందకుండ నీడేఱుపు మయ్య." వేంక. పంచ. 1. 304.
ఈడేర్చు
- 1. సఫలము చేయు.
- "కోర్కు లీడేర్చు."
- 2. కడతేర్చు.