పుట:PadabhamdhaParijathamu.djvu/193

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇలు_____ఇలు 167 ఇలు_____ఇలు

మీ, యిలు చూఱవిడిచి యిటు రా,వలయున్ వైష్ణవుల కొసగవల దేమైనన్." శు.క. 3. 71.

  • చూ. చూఱగొను, చూఱపుచ్చు.

ఇలు డించి

  • ఇల్లు వదలి వేసి.
  • "హీనదశకు నోడి యిలు డించి పరదేశములకు నిట్లు వచ్చి యును." భోజ. 2. 16.

ఇలు తీర్చు

  • గృహము నిర్వహించు. ఇంటి పనులు నిర్వర్తించు.
  • "సుఖు లై తలిదండ్రులు గూడి దేనియున్, దేవరవోలె నుండి యిలు దీర్పగ గాపుర మొప్పు వానికిన్." మను. 1. 53.

ఇలుదొర

  • ఇంటి యజమాని.
  • చూ. ఇలుఱేడు.

ఇలు నించికొను

  • ఇంటికి కావలసిన వస్తుసామగ్రిని సమకూర్చుకొను.
  • "ఇలునించికొనుట మొదలుగ, జలమున మెండొడ్డి మిగుల జండించుచు..." శుక. 3. 344.

ఇలు నింపడము

  • గృహప్రవేశము. బ్రౌను.

ఇలు నెత్తిగట్టుకొని పోగల్గుదురే

  • ఎవ రైనా ఏ దైనా యివ్వక పోయినప్పుడు మీ కున్న దంతా చచ్చిన తరువాత తీసుకు పోతారా అని నిరసనగా అనేమాట.
  • "ఇలు నెత్తి గట్టుకొని పో,గలుగుదురే దివిలి దాము గడపట బొరుగూ, రుల వెంట జనరె?" శుక. 3. 183.

ఇలుపట్టు

  • ఇంటిపట్టు.
  • "ఇలుప ట్టిమ్ముల బడసితి." హరి. ఉ. 1. 36.

ఇలుఱేడు

  • ఇంటి యజమాని.
  • చూ. ఇలుదొర.

ఇలువడి

  • సంప్రదాయము. కులీనత; అట్లా ముందుకు సాగి ఏర్పడిన అర్థం పాతివ్రత్యం.
  • "ఏటంపు బద మగునిలువడి సూచి." పండితా. ప్రథ. పురా. పుట. 479.
  • "వలను గులంబు లేని పరివారము కోటియు నేల...ఇలువడి గల్గెనేని యిల నెల్లను నేలగ జాలు." భార. శాంతి. 3. 103.
  • "కులమును రూపును బ్రాయుము, నిలువ డియుం గలుగునరున కీ గంటి నినున్." రాజ. చ. 3. 195.
  • "ఇలువడి ఘటశుద్ధి గలిగినకాంతలందు నిలుతు." భార. ఆను. 1. 285.
  • "ఇలువడి వదలుట యెగ్గు వొ మ్మనక." పండితా. ప్రథ. దీక్షా. పుట. 125.
  • "కులసతి యనియెడు కూరిమి లేక, యిలువడి గల దనియెడుప్రేమ లేక." అదే. 285. పుట.
  • చూ. ఇల్వడి.

ఇలువరుస

  • కులీనత్వము, గొప్ప వంశమునకు చేరి యుండుట.