పుట:PadabhamdhaParijathamu.djvu/192

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇల_____ఇలా 166 ఇలి____ఇలు

  • "వెఱ్ఱి దెలిసి రోకలి వెస జుట్టుకొన్నట్లు, యిఱ్ఱిదీము భోగముల సే సేము." తాళ్ల. సం. 8. 174.

ఇలకఱచు

  • "మన సిలకఱచి ధైర్య మూత గాగ నిలిచి.-" భా. రా. యు. 702.
  • చూ. ఇల్కఱచు.

ఇలకోడి

  • ఈలపురుగు.

ఇలచేర్పున

  • నేలకు దగ్గఱగా.
  • "మిక్కిలి పొడవు చనగ నీక విమానంబు, నిలచేర్పువన కొంత మేర బోనిచ్చె." కళా. 1. 194.

ఇలట ముండు

  • ఇల్లట ముండు.
  • అల్లుడు పెండ్లి చేసుకొని అత్త వారింటిలోనే ఉండి పోవుట.
  • "వెల్మ డొక్కడు...అతివ నర్థించి యిలట ముండగ."
  • పండితా. ప్రథ. పురా. పుట. 298.
  • చూ. ఇల్లట ముండు.

ఇలలో కలలో లేనిమాట

  • అసంభవము.
  • "వాడు ఆపిల్లను చేసుకుంటా డనుకోవడం ఇలలో కలలో లేనిమాట." వా.

ఇలలో లేనిమాట

  • అసంభవము.
  • "ఇలలో లేనిమాట చేస్తే ఏం లాభం?" వా.

ఇలాకా వేసుకొను

  • సంబంధము కలుపుకొను.
  • 'మీ యిలాకాలో ఎవరైనా పిల్ల లున్నారా' వగైరాచోట్ల మీకు సంబంధించినవారిలో అన్న అర్థం కానవస్తుంది. ప్రాంతం అనేఅర్థంలో కూడా ఇలాకా వాడడం కద్దు.

ఇలిభిక్ష బలిభిక్ష దొరకదు

  • వట్టిలోభి కొంప అనుట. ఎంత లేనిచోటైనా ఇలి (ఈగ) కి యింత దొరకుతుంది. అలాగే భూతబలిగా ఏముద్దో పడవేస్తారు. ఆమాత్రం కూడా లేనిచో టనుట.
  • "వాళ్లింట్లో ఇలిభిక్ష బలిభిక్ష దొరకదు." వా.

ఇలి యిడు

  • ఎంగిలి మెతుకులు విదిలించు.
  • "ఈగ కెన్నడు నే నిలి యిడనివారు." నైష. 7. 53.

ఇలుకరించు

  • పండ్లు బిగబట్టి కోరల కఱచు కొను
  • "భూకాంత నీరువట్టుకు గాక వదన మిలుకరింప గాంపించినపండ్లొ." వరాహ. 10. 30.
  • చూ. ఇలకఱచు.

ఇలు చూఱ విడుచు

  • నిలువుదోపువలెనే ఇంటిలో ఉన్న సర్వస్వాన్నీ యితరులకు ఇచ్చి వేయు.
  • "ని,శ్చలభక్తిం జోగులకును జంగాల