పుట:PadabhamdhaParijathamu.djvu/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటి______ఇంటి 139 ఇంటి_______ఇంటి

  • "ఆ వాడు పుట్టుశాస్తుర్లే కాని పెట్టు శాస్తుర్లు కా దంటారు. వాణ్ణి శాస్తుర్లనడం ఇంటిపేరు కస్తూరివారు అన్నట్లే." వా.

ఇంటిపైకి తెచ్చుకొను

  • ఎక్కడిదానినో తా నై తన మీదకే తెచ్చుకొను.
  • "మింటిపయి నుంటగా దని యింటిపైకి దెచ్చుకొంటి నటంచు బెన్ ఱిచ్చ వెడలు." ఆము. 5. 146.

ఇంటిబంటు

  • సేవకుడు.
  • "దర్పకు నేలదె యింటిబంటుగన్." శకుం. 2. 91.

ఇంటిబల్లియు చౌక సేయు

  • ప్రతివారికీ చులకన యగు

            "ఇల్లీల నుండ నింటం, బల్లియు నను
             జౌక సేయు పలుకులు విన రే, యెల్లెడ
             లోకములో మగ, డొల్లని యాసతిని
             మారి యొల్ల దనంగన్." శుక. 2. 64 పే.

ఇంటిబిడ

  • దాసి.
  • వేంకటేశాంధ్రము.

ఇంటిమగడు

  • భర్త.
  • "ఇంటిమగని జూచి యిల్లాలుదు:ఖించి, వెంట విటుని దగిలి వెతల బడును." వేమన.

ఇంటియతడు

  • మగడు.
  • "మా యింటియతని కాస పుట్టింప." శుక. 2. 111.
  • చూ. ఇంటాతడు ; ఇంటాయన.

ఇంటియాతడు

  • మగడు. ఇంటాయన అని నేడు వినిపిస్తుంది.
  • "కాంతకు మానరక్షకు డింటియాతండు." శృంగా. శకుం. 4. 82.
  • "మాయింటాయన ఊళ్లో లేరు." వా.
  • చూ. ఇంటాతడు ; ఇంటాయన.

ఇంటియాలు

  • ఇల్లాలు.
  • "ఇంటియాలి విడిచి యిల జారకాంతల వెంట దిరుగువాడు వెఱ్ఱివాడు." వేమన.

ఇంటి యెనుబోతునకంటె మదంబు హెచ్చు

  • బాగుగా క్రొవ్వి యుండు ఎనుబోతు (దున్న) ను పనీపాటా లేక పనికి రాక కొవ్వెక్కి ఉన్నవారితో పోల్చడం పరిపాటి.
  • ఇంటి యెనుబోతు తిండి తిని మరింత బలిసి ఉంటుంది.
  • "ఒకానొక, టైన గర్భముం బొదలని దౌట యింటి యెనుబోతునకంటె మదంబు హెచ్చి." హంస. 5. 24.
  • "వాడు దున్న పోతులాగా ఉన్నాడు." వా.

ఇంటివాడు

  • కులస్థుడు, వంశీకుడు.
  • వాడుకలో - మీరు ఏయిళ్ల వాళ్లు నాయనా! అనగా ఏ కులస్థులు అనే అర్థంలోనే