పుట:PadabhamdhaParijathamu.djvu/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటి______ఇంటి 138 ఇంటి______ఇంటి

  • "ముక్కంటి నీయింటికుక్కల మనుచు, జక్కులు గిక్కులు మ్రొక్కుచు గొలువ." బసవ. 4. 98.

ఇంటికొస్తుందా వాకిటికొస్తుందా?

  • దానివల్ల ఏమీ లాభం లేదు అనేఅర్థంలో ఉపయోగించే పలుకుబడి.
  • "వాడితో తగాదా యెందుకు రా? ఇంటి కొస్తుందా? వాకిటి కొస్తుందా?" వా.

ఇంటిగుట్టు

  • కుటుంబంలోని అంతరంగిక వ్యవహారాలు.
  • "ఇంటిగుట్టు రచ్చ కెక్క దొడగె." నాయకు. పు. 102.
  • "వాళ్ల యింటిగుట్టు ఎవరికీ తెలియకుండా నెట్టుకొని వస్తున్నారు." వా.

ఇంటిచాయల్లో

  • ఇంటి చుట్టుపట్టుల.
  • క్రొత్త. 31.

ఇంటితనం

  • కులీనత.
  • మర్యాద గలకుటుంబ మనుట.
  • "వాళ్ల యింటితనం మంచిది." వా.

ఇంటితనస్థుడు

  • "మర్యాద గల కుటుంబానికి చెందినవాడు.
  • "వాడు చాలా ఇంటితనస్తుడు." వా.

ఇంటిదొంగ

  • ఇంటిలోనే ఒకడుగా ఉంటూ దొంగతనం చేసేవాడూ, పరాయిగా ప్రవర్తించేవాడూ.
  • "ఇంటిదొంగను ఈశ్వరు డైనా పట్ట లేడు." సా.

ఇంటిపట్టు

  • స్థావరము.
  • "పసుపునిగ్గులు దేఱు పాపజన్నిద మొప్ప, బ్రమథాధిపతి యింటిప ట్టెఱింగె." మను. 2. 11.
  • "ఒక్కక్షణం యింటిపట్టున ఉండే వాడు కాదుగదా. వీడు పెండ్లి కాగానే చూచావా/" వా.

ఇంటిపట్టు ఎఱుగు

  • ఒక చోట స్థిరముగా కాపురముండుటకు అలవా టగు.
  • "ప్రమథాథిపతి యింటిప ట్టెఱింగె." మౌ. 2. 11.

ఇంటిపనులు నూఱు నటు వెట్టు

  • సొంతపనులు ఎన్ని ఉన్నా మానివేసి మఱొకదానికై పోవు.
  • "ఇవ్విధంబున జలిదీఱి యింటిపనులు, నూఱు నటు వెట్టి వల్లభునోరు గొట్టి." శుక. 3. 350.

ఇంటిపాప

  • దాసి. శ.ర.

ఇంటిపేరు

  • వంశనామము.
  • "ఇంటిపే రడిదమువార్." సూరన.

ఇంటిపేరు కస్తూరివారు

  • పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు. ఒక సామెతలోని భాగం.
  • "ఇంటిపేరు కస్తూరివారు ఇల్లంతా గబ్బిలాల కంపు." సా.