పుట:PadabhamdhaParijathamu.djvu/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇంటి_____ఇంటి 140 ఇంటి_____ఇంటి

యిప్పటి అలవాటు.

  • "పాకనాటింటి వాడవు." భీమ. 1. 23.

ఇంటివారిని లేపి యీవల దొంగ బంటుకు చే యిచ్చు

  • విశ్వాసద్రోహం చేయు.
  • ఇంటివారితో ఉన్నట్లే ఉండి దొంగకు సాయపడు కపటి అనుట.
  • నగళ్లలో కొలుపు - దొంగల్లో ఒళుపు అనుసామెత వంటిది.
  • "ఇంటివారిని లేపి యీవల దొంగ, బంటుకు జే యిచ్చు పాపాత్మురాల!"
  • గౌర. హరి. ద్వి. 984. 985.

ఇంటిలో దీపం పెట్టు

  • పడిపోతున్న సంసారాన్ని నిలబెట్టు.
  • "ఆయన మా యింట్లో దీపం పెట్టిన మహానుభావుడు." వా.

ఇంటిలోన గుండ్రించుచున్న కడుపు నిండునె?

  • నిర్వ్యాపారంగా ఉంటే పొట్ట గడవదు అనే సందర్భంలో ఉపయోగించే మాట. ఈ సందర్భంలోనే గోళ్లు గిల్లుకొంటూ కూర్చుంటే ముందు కెలా వస్తుంది అంటారు.
  • "నీవు మఱి యింటిలోన గుండ్రించుచున్న, గడుపు నిండునె దొర జేరి గ్రాస మడుగు." శుక. 2. 371.

ఇంటిలో నేదుము ల్లగు

  • పక్కలో బల్లెం అగు - అనుట.

            "ఎలసి యేప్రొద్దు గను వొంద నీక మరుడు,
              కలహమున కంకకా డయి కాలు ద్రవ్వ,
              బాండుబహుళక్షపా పరంపరలు వెడల,
              నింటిలో నేదు మూల్లయ్యె నిందుముఖికి."
                                                   ఆము. 5. 84.

ఇంటిలో పోరు

  • అనుక్షణబాధాకరము.
  • తాళ్ల. సం. 12. 198.

ఇంటిలో భద్రము

  • జాగ్రత్తగా ఉండు.
  • ఎవ రైనా పెద్దవారు పయన మై పోవునప్పుడు ఇంటిలో ఉన్నవారితో చెప్పుమాట. చిన్న వారు పోవునప్పుడు కూడా పెద్దలు ఇట్లే 'భద్రంగా వెళ్లు' అంటారు.
  • "పయన మెఱిగించి యింటిలో భద్ర మనుచు." హంస. 110.
  • "ఎల్లుండి వస్తాను. ఇంట్లో భద్రం నాయనా!" వా.

ఇంటిల్లిపాది

  • కుటుంబంలోని అందరూ.
  • "వాళ్లు పెళ్ళికి యింటిల్లి పాదీ వెళ్లారు." వా.
  • "ఆ పెళ్లికి మేం యింటిల్లి పాదీ వెళ్లాము." వా.

ఇంటివాడు

  • 1. గృహస్థు.
  • 2. వంశీకుడు.
  • "ఇంటివా డన గృహస్థున కగు." సాంబ.
  • "పాకనాటింటివాడవు బాంధవు డవు." భీమ. 1. 23.