పుట:PadabhamdhaParijathamu.djvu/121

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అలో_____అల్ల 95 అల్ల_____అల్లా

 • "వీడుబట్టు అలుచాయె వేడుక లుడివోయెను." తాళ్ల. సం. 5. 128.
 • "వాడింటికి పదేపదే పోవడంవల్ల అలుసై పొయ్యాను." వా.

అలో లక్ష్మణా యను

 • పరిదేవించు.

".......బావమాని దివి రాహుం బట్టి
మ్రింగంగ నై, యల్లో లక్ష్మణ యంచు
బాఱె నత డయ్యాఖండలుం జూచు
చున్, బెల్లై భీభర మేచ నింద్ర!
మహిభృద్భేదీ యటంచున్ వెసన్."
        రామకథా. ఉత్త. కాం. పూ. భా. 8. 48.

అలో పొలో యను

 • కుయ్యో మొఱ్ఱో యను.
 • "తను దత్తుగా గయికొనితల్లి యలో పొలో యంచు దు:ఖమ్ము నొందు చుండ." పాణి. 5. 108.

అల్కానాయాలు

 • తిట్టు.
 • చూ. అల్కా వాడు.

అల్కావాడు

 • నీచుడు, హల్కా అంటే తేలిక.
 • చూ. హల్కా వాడు.
 • "వాడు వట్టి అల్కావాడు. వాడికి కాస్త దూరంగా ఉండడం మంచిది." వా.

అల్ల కల్లోల మగు

 • నానా అల్లరీ అగు.
 • "దివిటీదొంగలు వస్తున్నా రనేసరికి ఊరంతా అల్లకల్లోలం అయిపోయింది." వా.

అల్లటపెట్టు

 • కష్ట పెట్టు.
 • అల్లాడునట్లు చేయు అని అర్థం. నేటి రూపం అల్లాడపెట్టు.
 • "న న్నెంత అల్లట పెట్టె దో యయ్య నే నెఱుగ." బస. 1. 10.

అల్లము తాడే బెల్ల మయినది

 • గతి లేనమ్మకు గంజే పానకము వంటిది.
 • అల్లం కారంగా ఉంటుంది. అదే బెల్లంగా మారింది అనుట.

అల్లరీ ఆగం

 • చూ. అల్లరీ హంగామా.

అల్లరీ హంగామా

 • గందరగోళం, హడావుడి.
 • "వాడి దంతా వట్టి అల్లరీ హంగామా. చేసేదీ లేదూ పెట్టేది లేదూ." వా.
 • చూ. అల్లరీ హంగామా.

అల్ల ల నాడు

 • కదలాడు (బరువుతో)
 • ధ్వన్యనుకరణము.
 • "లేచి, కుచంబులున్ దుఱుము లేనడు మల్లల నాడ నయ్యెడన్." మను. 2. 29.

అల్లాటప్పా

 • తేలిక యైనది, మామూలు.
 • వ్యతి రేకార్థంలో నే వినవస్తుంది.
 • "ఇ దేం అల్లాటప్పా వ్యవహారం కాదు. నిదానంగా ఆలోచించు." వా.

అల్లాడగ

 • గజగజలాడగా.
 • భీమ. 1. 47.