పుట:PadabhamdhaParijathamu.djvu/122

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అల్లా____అల్లి 96 అల్లి_____అల్లు

అల్లాడి ఆకులు మేయు

 • నానాకష్టాలు పడు.
 • "అల్లాడి ఆకులు మేసి ఆ ఊరు వెడితే తీరా వాడు ఇంట్లో లే డన్నారు." వా.

అల్లాడు

 • రోదించు, కొట్టుకొను.
 • అలుగురాజు. 65 పు.

అల్లారుబెల్లం

 • ప్రియ మైనది.
 • "ఎల్లబంధువులకు నల్లారుబెల్ల మై." కళా. 6. 19.

అల్లారుముద్దుగా

 • గారాబంగా.
 • "అనుగుంగ్రీడల నెల్లవారలకు నిట్లల్లారుము ద్దైనకూతునకున్." వసు. 3. 32.
 • "వాళ్లు ఆ పిల్ల నెంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు." వా.

అల్లిందామరయునుబోలె

 • అవినాభావముగా.
 • "నీరజవదనా!, యేమిటికి దలకె దల్లిం, దామరయునుబోలె నుండి తగవు విడుతురే." ఉ. హరి. 5. 20.

అల్లి బిల్లి కొను

 • వ్యాపించు.
 • "మావుల్ క్రోవులు నల్లి బిల్లి కొను కాంతారంబులందు." మను. 2. 22.

అల్లి బిల్లిగ నల్లుకొను

 • చిక్కగా అల్లుకొను.
 • "వాసంతిక లుద్యల్లీల నల్లిబిల్లిగ నల్లి కొనిన యొక లతా గృహాంతర సీమన్." మను. 3. 113.

అల్లిబిల్లిగా

 • చిక్కగా.
 • "అల్లిబిల్లిగా నల్లుకొను బొండు మల్లి యల." రాధి. 1. 115.

అల్లిబిల్లి యగు

 • కలసిమెలసి యుండు, కూడి మాడి అన్నట్లు.
 • "అరిగి తనకూర్మిచెలువతో నల్లిబిల్లి, యగుచు నెప్పటియట్ల నెయ్యమున నుండె." పరమ. 3. 274.

అల్లివి ల్లై యుండు

 • ఆనందముతో నుండు.
 • "బల్లిదుం డలమేల్మంగపతి అల్లి బి ల్లై యున్నా డమ్మా యశోదమ్మా." తాళ్ల. సం. 10. 161.

అల్లి బెల్లి మాటలు

 • కల్లబొల్లి మాటలు.
 • వెంకటే. 3. 161.

అల్లి రము లాఱగించు

 • అల్లెము తిను.
 • "అల్లిరము లారగించ వెన్నుడ వై వేడుకతో విచ్చేసినట్లు." తాళ్ల. సం. 9. 144.

అల్లుకొను

 • 1. వ్యాపించు.
 • "జలశీకరంబులు చద లెల్ల నిండి... చుక్కల నల్లుకొనగ." వర. రా. యు. పు. 16 పంక్త్ల్ 25.
 • 2. వృద్ధిచెందు.
 • "అల్లుకొనె గర్మములు అక్కడికి నక్కడికి." తాళ్ళ. సం. 7. 256.