పుట:PadabhamdhaParijathamu.djvu/120

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


అలి_____అలు 94 అలు_____అలు

అలిగి పఱపుపై పడినగతి

 • కారణము బాధ కలిగించున దైనను కార్యము శుభప్రదమైనపట్టుల ఉపయోగించే ఉపమానం.
 • రొట్టె విరిగి నేతిలో పడినట్లు వంటిది.
 • "నీవిక నడవి జరింపగ గలుగు టలిగి పఱపుపై బడినగతి యయ్యె." కా. మా. 4. 146.
 • చూ. తన్నిన పరపుపై పడినట్లు.

అలివేణికుండలు

 • చూ.అఱిమెనకుండలు.

అలుక తీర్చు

 • బుజ్జగించి కోపము తీర్చు.
 • "అలుక దీర్చెద గాదేని జలరుహాక్షి." ప్రభా. 5. 137.

అలుకలు తీర్చు

 • కోపము పోగొట్టు.
 • "వలపులపల్ల వుం డొకడు వట్టిచలంబున నేపదీన మై, యలుకలు తీర్చి తీర్చి యొక యచ్చర వచ్చి..." మను. 5. 62.

అలుకుచుట్ట

 • తిట్టు.
 • పేడ అలకడానికి ఉపయోగించే గుడ్డపేలిక అనుట.
 • "వాడో అలుకుచుట్ట." వా.

అలుకు వోదు

 • ఈ చెడ్డపేరు, ఈ మచ్చ పోదు.
 • నే నేం తప్పుచేశా నని అలుకు?" అని నేటి వాడుకలో ఈ అలుకు కనిపిస్తుంది.
 • "పొరిగొన కీయల్కు వో దని సూచు..." పండి. ద్వితీయ. మహిమ. 47 పుట.

అలుగువారు

 • పొంగిపొరలు.
 • అలుగు లనగా తూములు. చెఱువు నిండా నిండినప్పుడే అలుగులు పారడం జరుగుతుంది.
 • "అరిది సురతభావరసము అలుగువార బోలును." తాళ్ల. సం. 3. 219.
 • చూ. అలుగులుపాఱు.

అలుగులు వాఱు

 • చెఱువులు నిండినప్పుడు పైన నీళ్లు ఒక వేపు దొరలి పోతాయి. అలాగే లక్షణ యా ఇట నిండి పొరలి పారు అనుట.
 • "పళ్ళెరం బలుగులు వాఱె రా యనుచు." బస. 7. 201 పుట.
 • "చనుగప్పు దొలగ వాసనగాలి కెదురేగు, బరు వొప్ప నలుగుల బాఱు కరణి." మను. 3. 31.
 • "చెఱువులు అలుగులు పారినవి." వా.
 • చూ. మఱవపాఱు.

అలుచగు

 • చులకన యగు.
 • నేటి వాడుకలో అలుసగు అన్నట్టుగా వినవస్తుంది.