పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీ పశ్చిమగోదావరిజిల్లా పర్యటన డిశంబరు 27, 1933 బుధవారం నాటి నుండి నిశ్చయింపబడినది. జిల్లా హరిజనసేవకసంఘ అధ్యక్షునిగా కలిదిండి గంగరాజు, కార్యదర్శిగా చంగల్వల చిట్టిపంతులు నియమించబడ్డారు. ప్రతీ పట్టణానికి ఆహ్వానసంఘము ఏర్పడి కావలసిన కార్యక్రమాలు చురుకుగా నిర్వహించటం ప్రారంభించారు. (Yeටඨිසී రాక సందర్భమున మోహన్దాస్ ఖద్దరు పరిశ్రమాలయము, ఏలూరు వారు ఒక రూపాయి కొనుగోలుపై అణా (ఆరు పైసలు) తగ్గింపు ఇస్తున్నట్లు, డిశంబరు 18 నుండి 81 వరకూ

మాగంటి బాపినీడు ఆంధ్రరాష్ట్ర హరిజనసేవక సంఘప్రధానకార్యదర్శి

ఈ సౌకర్యం లభించునని దండు నారాయణరాజు ప్రకటించారు. * దాట్ల చిననీలాద్రిరాజు, పెనుమంట్ర, ఆచంట పెదగోపాలము, పాలకొల్లు మొదలగువారు హరిజనోద్ధరణ కార్యక్రమముతో పాటు హరిజన బాలబాలికలకు గాంధీజీ సమక్షమున ఖద్దరు దుస్తులు పంపిణీ చేయాలని నిర్ణయించినారు. మిగిలిన ဗြိသံဝဲ&သ8သ©ဃ కూడ ఇట్టి కార్యక్రమములు చేపట్ట వలెనని విజ్ఞప్తి చేశారు.

గాంధీజీ హరిజనయాత్ర సందర్భములో డిశంబరు 16వ తేదీ నుండి, జనవరి 4 1934 వరకూ 20 రోజులు గడిపినారు. అందు 20, 21, 22 తేదీలు మదరాసు కార్యక్రమములలో పాల్గొన్నారు.డిశంబరు 18,19,25,26తేదీలు జనవరి 1,2 తేదీలు గాంధీజీ విశ్రాంతి దినములు. మొత్తము గాంధీజీ ఆంధ్రదేశములో సంచరించిన దినములు 11 రోజులు మాత్రమే. ఈ కాలంలో గాంధీజీ 10 జిల్లాలు సంచారము చేశారు. 1,024 మైళ్ళ రైలుపైన, 667 మైళ్ళ మోటారు వాహనములపైన, 15 మైళ్ళస్టీములాంచిపైన, 2 మైళ్ళ కాలినడకను మొత్తం 1708 మైళ్ళ సంచారము చేశారు. 76 గ్రామములు, పట్టణములను సందర్శించెను 60 సభలలో ఉపన్యాసములు ఇచ్చెను. 6,20,000 మందివారి ఉపన్యాసములు వినుటకు అవకాశము కలిగింది. దాదాపు 12,00,000 మందికి వారిని దర్శించు భాగ్యము దక్కింది." is a