పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

SLLSS LSLSLSSSLS -పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

ఉద్దేశంతోగాని, రాజకీయప్రయోజనాల కోసంగాని చేయటం లేదు. ఇది అత్యుత్తమమయిన మానవసేవ అని నాతలంపు. ఇది హిందూమతానికి సంబంధించిన ఆంతరంగిక సంస్కరణ. హిందువుల మయిన మనము ఇంతకాలం ఎవరిని సంఘ బాహ్యలను S ఎవరిపట్ల చెప్పరాని అపచారాలను చేసినామో వారికి క్షమాపణ పూరకంగా హరిజనసేవ అనే ఈప్రాయశ్చిత్త కర్మ ఉద్దేశించబడినది". ఈ ప్రకటన గాంధీజీ హరిజన యాత్ర ప్రధాన ఉద్దేశాన్ని ಆಲಿಯಿವೆನಿಝ್ರಾಂದಿ.

మహాత్ముని ఆంధ్రదేశ సంచారమును గూర్చి ఆంధ్రరాష్ట్ర హరిజనసేవక సంఘప్రధాన కార్యదర్శి మాగంటి బాపినీడు, ఆయా జిల్లాల హరిజనసేవక సంఘ కార్యదర్శులు చక్కని ఏర్పాట్ల గావించారు. ఈ సందర్భములో ప్రజలు నిర్వర్తించవలసిన విధులను గూర్చి బాపినీడు ఈ విధంగా వ్రాశారు. "మహాత్ముని హరిజనసేవా నిధికి సన్మానసంఘం ఏర్పరచి వివిధ సంఘాల పక్షాన విరాళాలు ಏಮೈಟಲ್ಲ విశ్వప్రయత్నాలు చేయవలెను. කිඟුළුළු” ఇకముందు హరిజనసేవా కార్యక్రమాన్ని సాగించటానికి ఈ నిధియే మూలాధారము. గాంధీజీ సభకు రావటానికి ముందే సేకరించిన మొత్తం లెక్కపెట్టి ఎవరెంత ఇచ్చినది వివరంగా వ్రాసి ఉంచవలెను. ఒక నిర్ణీతస్థలం నుండి వేరొక స్థలానికి పోయేటప్పడు మార్గము మధ్యలో మహాత్ముని కారుకు అడ్డంవచ్చి కార్యక్రములకు ఆలస్యమూ, ఆటంకమూ కలిగించవద్దు. అయా గ్రామప్రజలకు నచ్చజెప్పి తగు ఏర్పాట్ల చేయవలెను. మార్గమధ్యంలోగాని, సభలలోగాని మహాత్మునిపై పూలదండలు పూలగుత్తులు విసరరాదు. మహాత్ముని కారుకెవరూ అడ్డం పడుకొనరాదు. మార్గమధ్యాన గాంధీజీ ప్రయాణంచేసే గ్రామాలలోను, ఆయన ఆగేచోట్లలోను సుశిక్షితులైన స్వచ్ఛంద సైనికులు ఉండి తగిన ఏర్పాట్ల చేయవలెను. రైల్వేస్టేషను వద్ద నుండి సభలోకి వచ్చేటప్పడు మార్గంలో వాలంటీర్లు రోడ్డు కిరువైపుల నిలబడి మోటారు ఆలస్యం లేకుండా ವಳ್ಳ೬ುಲ್ಲು చూడవలెను. హరిజన సమస్యకై చారిత్రాత్మక ప్రాయోపవేశంచేసి, ఇరవై ఒక్క దినం ఉపవాసం చేసి మృత్యు ముఖమునుండి వెలువడిన గాంధీజీ దర్శనార్ధం అనేక మంది నిరీక్షిస్తూ disoė Jočóo. అందువలన నిశ్శబ్దసభలు ఏర్పాటు చేస్తేగాని అనుకున్న ప్రయోజనం కలుగదు. సభ ఎంత చప్పడు లేకుండా జరిగితే మహాత్మునికి అంత సంతోషము. మహాత్ముని సందేశం ప్రజలందరికి చక్కగా వినిపించడానికి దూరశ్రవణయంత్రాలకు కేంద్ర హరిజన సేవక సంఘంవారునూ, రాష్ట్ర సంఘం వారునూ ప్రయత్నం చేస్తూన్నారు. మహాత్ముడు పోయే వీధులను విదేశీ కాగితాలతో కాక పచ్చని ఆకుతోరణాలు మొదలయిన వానితో చక్కగా అలంకరించవలెను. ఈ విధంగా ఆంధ్రదేశంలో మహాత్ముని హరిజన పర్యటన జయప్రదం చేయటానికి మీ అందరి సహకారం అభిలషిస్తున్నాను." *