పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

-పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గాంధీజీతో పాటు హరిజన యాత్రలో పాల్గొనిన అనుచరవర్గము.

1. ప్రొఫెసర్ మల్మానీ : గాంధీజీ హరిజన యాత్రలో కార్యక్రమములు నిర్ణయించే బాధ్యత వహించిన కార్యదర్శి,

2. మీరాబెన్ : ఆంగ్లదేశపు ఓడల అధికారి స్టేడ్ కుమార్తె. భారతదేశమునకు వచ్చి గాంధీజీ శిష్యురాలైనది. గాంధీజీని కనురెప్పవలె కాపాడేది. ఆయన కమోడ్ సైతము శుభ్రపరిచేది. మహాత్ముని భోజనము, వసతి, నిద్ర అన్నీ ఆమె ఏర్పాటు చేస్తూండేది. రైళ్ళలో క్రింద పడుకొనేది. గాంధీజీ వసతులలో అవసరమయిన మరుగుదొడ్లు సైతం పరిశుభ్రం చేసేది.

3. చంద్రశంకర శుక్లా : మహదేవదేశాయి జైలు నందున్నందున అంతరంగిక కార్యదర్శిగా వ్యవహరించారు. గుజరాత్ "హరిజన్ సంపాదకుడు. గాంధీజీ ఉపన్యాసాలు పదిలపరిచేవాడు.

4. శ్రీమతి ఉమాబజాజ్ : జమన్లాల్ బజాజ్ రెండవ కుమార్తె. గాంధీజీకి సేవలు చేయుటలో మీరాబెన్ కు సహాయపడేది.

5. శ్రీమతికృష్ణాబెన్ : కర్ణాటకయువతి. ఉత్తరాలు చదువుటయందు, వంటలయందు మీరాబెన్కు సహాయపడేది.

6. విశ్వనాధపాండ్య : దామోదర దాసు : వీరిద్దరూ సభలలో వసూలైన విరాళాలు వివరాలు పదిలపరిచే కోశాధికారులు.

7. రామనారాయణ్ చౌదరి : ఉత్తర ప్రత్యుత్తరాలలో గాంధీజీకి సహాయపడేవారు. 8. శర్మ : గాంధీజీ పరివారపు సామగ్రిపదిలపరిచే బాధ్యత వీరిది

పశ్చిమగోదావరిజిల్లాలో గాంధీజీ

గాంధీజీ ఆయన బృందము తూర్పుగోదావరి జిల్లా సీతానగరం ఆశ్రమం నుండి డిశంబరు 26, 1933 సాయంకాలం గం|6-30ని|లకు ప్రభాకరం అను స్టీంలాంచిలో పశ్చిమగోదావరి జిల్లాలోని తాళ్ళపూడి రేవుకు బయలుదేరారు. జిల్లా కాంగ్రెసు నాయకులు దండు నారాయణరాజు, జిల్లా హరిజనసంఘ అధ్యక్షులు కలిదిండి గంగరాజు సీతానగరం వెళ్ళి గాంధీజీని ఆహ్వానించి తోడ్కొని వచ్చారు. స్టీంలాంచి గోదావరిలో ఇసుకతిప్పకు తగులుట వలన నది దాటుటకు సుమారు 45 ని! ఆలస్యమైనది. లాంచిలోని సామగ్రి చిన్నపడవలోనికిమార్చి కొందరు సహచరులను కూడ వేరుగా తీసుకొని వచ్చిరి చివరకు. తాళ్ళపూడి రేవునకు రాత్రి 8-00 గం|లకు చేరారు . ( Jeටඨිකී పర్యటన ఏర్పాట్లకు ఏలూరు నుండి S”ဆိ်သဎွÓင္ငံ సత్యనారాయణ, నిడదవోలు నుండి శనివారపు సుబ్బారావు, మోటారులను, బస్సులను తీసుకొనివెళ్ళారు. గాంధీజీ, ෙ66 •