పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

వారు ఎవరైనా ఖైదులో బంధించబడినప్పడు ఎంత ఖర్చు అయినప్పటికీ さye○○ విడిపించటానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కదా! అదే విధంగా పరప్రభుత్వ బంధనం నుండి దేశ స్వరాజ్యం సంపాదించవలెనని మీరు కోరితే ఎంతటి త్యాగమయినా చేయగలరు. అట్టిత్యాగనిరతితో ఖద్దరు ధరించండి. ఖద్దరు ప్రియమైనదని మీరనటం త్యాగం చేయకుండా స్వరాజ్యం సంపాదించవలెనని మీ అభిప్రాయమైనట్లు కనబడుతుంది. విదేశీ వస్తాలు చౌక అంటరా మీరు. అది ఊరకనే లభించినా స్వీకరించరాదు. దానివెనుక పరతంత్రమనే డు, మీ బలహీనత దాగి ఉన్నాయి. దానిని విసర్జించండి. మీ వస్తాల కోసం మీ స్వశక్తిపై ఆధారపడండి. ఏ సందర్భములోను మీ మాతృదేశంనుండి మీ సొమ్మ పరాయి దేశములకు పారవేయకండి" అని ఉద్వేగంతో ఉపన్యసించారు.

సమావేశం పూర్తిఅయిన తరువాత బాదర్వాడ శేషమ్మ పల్లెడ (రూ. 50/-), కొండ గంగమ్మ గాజులజత (రూ. 40/-), ఉనికిల ఈశ్వరమ్మ గాజులజత (రూ. 40/-), కొండ నాగమ్మ 2 సవరసులు (రూ.27/-), ఉమ్మా అన్నపూర్ణ ఒక గాజు (రూ.20/-), భోగరాజు కనక దుర్గమ్మ కొండ రామమ్మ, బరద్వాడ రామలక్ష్మీ దత్తాడ వెంకమ్మ ఒకొక్కరు ఒక ఉంగరము(రూ.20/-) చొప్పన సమర్పించారు. కొండ చిన్నమ్మ, మహదేవుని రాజేశ్వరమ్మలు 1/4 కాసు చొuన ఇచ్చారు. ధనరూపమున రూ. 1,116/- ఖద్దరు నిధి