పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

గ్రంధాలయం' తరపున రూ. 950/- సమర్పించారు. రాజవీధి నుండి గాంధీజీ వచ్చుచుండగా 80 సం|వృదురాలగు వల్లభనేని గంగమ్మగారు కారు తన ఇంటిముందు అపి రూ.116/- సమర్పించగా గాంధీజీ చిరునవ్వుతో స్వీకరించారు. గాంధీజీ గ్రామసభ యందు పదినిమిషములు విదేశీ వస్త్ర బహిష్కరణ, ఖాదీ ధారణనుగూర్చి ప్రత్యేకంగా బోధిసూ, కాంగ్రెసు కార్యక్రమములను విధిగా నిర్వర్తించవలెనని చెప్పారు. సభలో స్త్రీలు సమర్పించిన ఆభరణముల విలువ రూ.300/- వడ్లపట్ల మాణిక్యాలరావు గాంధీ దంపతులకు ఖద్దరు వస్త్రములు సమర్పించి వారి దీవెనలు పొందారు. వెలమాటి శ్రీమన్నారాయణ రూ.116/–, వడ్లపట్ల కొండయ్య, వెలమాటి దశరధరామయ్య, వడ్లపట్ల రామకృష్ణయ్య, వడ్లపట్ల వరఖలు కృష్ణయ్య ఒకొక్కరు రూ.50/- చొప్పన, మద్దిపాటి చినబసవయ్య, వెలమాటి రామచంద్రరావు, వెలమాటి రామదాసు, జిళ్ళెళ్ళి మూడి సింహాద్రి అప్పారావు మొlవారు ఒక్కొక్కరు రూ.25/- చొప్పున ఖద్దరు నిధికి సమర్పించారు. గాంధీజీ 7.15 నిuలకు కొవ్వలినుండి బయలుదేరారు.

ධීරයළුලෙරිය

గాంధీజీ సా|| 7.45 ని|లకు దెందులూరు చేరినారు. గ్రామస్తులు రు. 1,000/- కొన్ని నగలు ఖద్దరు నిధికి సమర్పించారు. సహకార సంఘము వారి సన్మాన పత్రాన్నిస్వీకరిస్తూ ఖద్దరు ఉత్పత్తి పెంచుటకు, ఖద్దరు ఎక్కువగా సరఫరా చేయుటకు సహకార ఉద్యమం తోడ్పడవలెనని ఉపన్యసించారు. స్వచ్ఛంద సేవకులు సభను చక్కని క్రమశిక్షణతో నిర్వహించారు.

గుండుగొలను

రాత్రి 8.00గంIలకు గాంధీజీ గుండుగొలను గ్రామం చేరారు. గ్రామస్తులాయనను ఎంతో ఉత్సాహంతో స్వాగతించారు. సుమారు రెండు వేలమంది సభకు హాజరయ్యారు. గాంధీజీ ఉదయం నుండి సంచారమునందు ఉండుటవలన బడలిక వలన మాట్లాడలేనని epr;8). గ్రామస్థలు పదే పదే కోరిన మీదట కారులో కూర్చుండియే ఖద్దరు ధారణ, విదేశీవస్త్ర బహిష్కరణలను గూర్చి మాట్లాడారు. పసులూరి కోదండ రామయ్యగారు ప్రజలను శాంతముగా ఉండాలని కోరారు. అప్పుడు ప్రోతలలో ఒకరు “ఖద్దరు చాలప్రియముగా ఉన్నది. అందువలన కట్టలేకుండా ఉన్నావ " అన్నారు. గాంధీజీ దానికి జవాబుగా "ఖద్దరు ఎంత ఖరీదయినా ప్రియంకాదు. మీకు సన్నిహితులు, ప్రేమ పాత్రులు అయిన