పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్యుని సంచారము

పోతునూరు

సాయంత్రం 5.30ని|లకు గాంధీజీ ఆయన అనుచరులు ఏలూరుకు 10 మైళ్ళ దూరంలో ఉన్న పోతునూరు గ్రామానికి బయలుదేరారు. రోడ్లు అన్నీ జనసందోహంతో క్రిక్కిరిసిపోయినవి. "గాంధీజీకిజై', "వందేమాతరం' నినాదాలు మిన్నుముట్టాయి. సంపన్నులయిన పోతునూరు గ్రామస్తులు గాంధీజీని ఆహ్వానించుటకు మనోహరమైన ఏర్పాట్ల గావించారు. పోతునూరు గ్రామంలో ప్రత్యేకముగా నిర్మించిన ఒక పందిరిలో నాలుగు వేలకు పైగా ప్రజలు సమావేశమైనారు. ఒక స్త్రీ ‘వివేకానంద గ్రంథాలయ నిర్మాణానికి కావలసిన ధనాన్ని ఇవ్వగలనని వాగ్గానం చేయటం వలన, దానికి పునాది రాయి వేసేందుకై (ಗ್ಮಿನ್ಡಲು గాంధీజీని ప్రార్థించారు. గాంధీజీ కూర్చుండిన కారులోనికి ఒక బొక్కెన, సున్నము, ఒక ఇటుక, తీసుకొని వచ్చి అందించారు. గాంధీజీ వెండి తాపీతో సున్నం తీసి ఇటుకపైవేసి పునాది వేసినట్టు ప్రకటించారు. గాంధీజీకి గ్రామస్తులచే రూ.2,000/- సమర్పించబడినవి. అందులో రూ.190/- లాలాజీ నిధికి కేటాయించ బడ్డాయి.

( \ලටඨිස් ඩීමටයි.ඒ” ఉపన్యసిసూ 'మీరు నాకు ఖద్దరు నిధికి కొంత నగదు, కొన్ని నగలు ఇచ్చారు. చాలా ఆనందము కాని మీరందరూ విదేశీ వస్త్రములను విసర్జించి ఖద్దరు కట్టండి. మీరు ఆవిధంగా చేస్తే డబ్బు వసూలు చేయవలసిన అవసమే ఉండదు. ఇక్కడ తాగుబోతులు ඒරිෆික්‍ෂත්‍රඡාබ්ඩුක්‍රි. కల్లు, బ్రాంది వంటివి తాగుడు భూతాలు. ఇక్కడ పంచములలో తాగినవానికి ఐదు రూపాయాలు జరిమానా విధిస్తారని ఇప్పడేవిన్నాను. అది భేషయినపని" అని అన్నారు. తరువాత అంటరానితనము అనే పాపకార్యమును విడనాడమని, బాల్య వివాహములు అనాగరికములని, స్వరాజ్య సంపాదనకు మీరు కృతనిశ్చయులైతే కాంగ్రెసు కార్యక్రమమును తప్పకుండా నిర్వర్తించవలసి ఉంటుందని ఉద్బోధించారు. తరువాత వెండి తాపీని వేలం వేయగా వచ్చిన రూ.80/- లు ఖద్దరునిధికి జమచేశారు.

కొవ్వలి

పోతునూరు నుండి గాంధీజీ తన అనుచరులతో సంపన్నమైన కొవ్వలి గ్రామానికి సాయంత్రం 6.30ని|లకు చేరారు. వడ్లపట్ల కొండయ్య, వెంకటరత్నం మొదలగు వారినాయకత్వంలో గ్రామస్తులు ఎదురేగి ఆయనను ఆహ్వానించారు. పురజనులు 'తిలక్