పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపిచువారును, విదేశీ వస్త్రములు ధరించువారును పాలకవర్గ సభ్యులుగా నుండరాదు అని పేర్కొన్నారు.

సాయంత్రం 5 గం|లకు పాకీవారి పిల్లలు కొందరు తమ ఉపాధ్యాయునితో కలసి గాంధీజీ సందర్శనకై వచ్చారు. వారంతా చక్కగా పరిశుభ్రముగా ఉన్నారు. గాంధీజీ ప్రేమతో వారిని పలుకరించి కష్టసుఖాలు తెలుసుకొని వారికి మిరాయిలు పంచిపెట్టారు. జాతీయ పాఠశాల పాలకవర్గ సభ్యులను రప్పించి విద్యాభివృద్ధిని గూర్చి ప్రసంగించిరి. ప్రభుత్వ సహాయములేకుండా స్వశక్తిపై విద్యాలయం ఆధారపడవలెనని, మంచి నియమ నిబంధనలతో విద్య నేర్పవలెనని, సంఖ్యతగ్గినా ఫరవాలేదు, విద్యా విలువలు మాత్రం తగ్గరాదని బోధించారు. 13

గాంధీజీ ఏలూరు వచ్చిన తరువాత క్షురకర్మకై ఖద్దరు కట్టిన మంగలి కావలెనని అన్నారు. 36 గం|లు దాటినా అట్టి మంగలి లభ్యంకాలేదు."మీరు ఖద్దరు ధరించిన మంగలి వారికి ఎక్కువ గిరాకీ ఉండేటట్లు చేయవలెను. అదే విధంగా వడ్రంగులు, చాకళ్ళు, ఇతరపని వాళ్ళ విషయంలోకూడా ఖద్దరు కట్టిన వారికే ఎక్కువగిరాకీ ఉండేటట్లు చేయండి. ఆ విధంగా ప్రజలలో ఖద్దరు వ్యాపకం చేయవలెను"అని గాంధీజీ కార్యకర్తలకు නි”ශිටඞටරය.