పుట:Pachima Godavari Jillalo Mahatmuni sancharam-Gadam Gopalaswamy.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పశ్చిమ గోదావరి జిల్లాలో మహాత్ముని సంచారము

చేకూంది. తదుపరి విదేశీ వస్త్రములను గుట్టగా వేసి తగులబెట్టారు. ఆరాత్రి గాంధీజీ భోగరాజు వీరవెంకయ్యగారి గృహమున నిద్రించారు. కొద్దిగా రాత్రి వర్షము కురిసినది.

తాడేపలిగూడెం

ఏప్రియల్ 25వ తేదీ ఉదయం గాంధీజీని తాడేపల్లిగూడెం తాలూకా బోరు అధ్యక్షుడు కలిదిండి గంగరాజు, ఆహ్వానసంఘం కార్యదర్శి శనివారపు సుబ్బారావు, జిల్లా కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు డానజీర్ అహమ్మద్, తాలూకాబోర్డు ఉపాధ్యక్షుడు దావులూరి శేషగిరిరావు మహాత్ముని గుండుగొలనులో కలుసుకొన్నారి. వీరిని దండునారాయణరాజు గాంధీజీకి పరిచయము చేశారు. వీరందరూ తల ఒక నారింజపండు గాంధీజీ హస్తములందు ఉంచి నమస్కరించి తాడేపల్లిగూడెమునకు రావలసినదిగా ఆహ్వానించారు. గూడెములో జరుగబోవు కార్యక్రమ వివరాలను గంగరాజు గాంధీజీకి వ్రాసి ఇచ్చారు. పైవారందరూ శలవుతీసుకొని బయలుదేరెదము అనగానే గాంధీజీ నేను బయలుదేరుచున్నాను కలిసే వెళ్ళిదము అన్నారు. నజీరు అహ్మద్ మేముముందుగా వెళ్ళి కార్యక్రమము జయప్రదముగా జరుగుటకు ఏర్పాట్లచేసెదమని బయలుదేరి గూడెముచేరారు.

సభాస్థలి ఏర్పాట్ల బైర్రాజు రామరాజు, యద్దనపూడి సుబ్బారావు, పసల సోమయ్య నాయకత్వంలో సమర్థవంతంగా నిర్వహించబడింది. గాంధీజీ తన అనుచరవర్గముతోసహా తాడేపల్లిగూడెం 7గంIIలకు చేరినారు. దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ రాజమండ్రి నుండి గాంధీజీకి అభినందనలు సమర్పించేటందుకు SoéSooÖ విద్యార్థినులను తీసుకొని వచ్చారు. గాంధీజీని సన్మానించేందుకు ఏర్పాటుచేయబడిన మంటపమునందు ఆ బాలికలు గాంధీజీకి హారతి ఇచ్చారు. ఈ బాలికలు, స్థానిక విద్యార్థినులతో కలసిపాడిన దేశభక్తి గీతములతో సభ ప్రారంభమైంది.

గాంధీజీ ఆహ్వాన సంఘమువారేర్పరచిన వేదికపై కూర్చుండిరి. లైgూలూSం ಬೌಲ್ಡಿ వర్తక సంఘముల తరుపున కలిదిండి గంగరాజు, తాలూక గ్రామపంచాయితీ సంఘము తరుపున ఇందుకూరిసుబ్బరాజ్ఞు, కేసరీ సమాజ నాటక సంఘము తరుపున మాచిరాజు రామచంద్రమూర్తి గాంధీజీకి సన్మానపత్రములనొసంగారు. వర్తక సంఘమువారు రూ.1,133/- తాలూకా బోర్డు మెంబర్లు రూ. 116/–, తాలూకా గ్రామపంచాయితీలు రూ.116/–, కేసరీనాటకసమాజం రూ.116/–, ఖద్దరునిధికి సమర్పించారు. సభయందలి ప్రజానీకాన్ని ఖద్దరు నిధిని సమర్పించవలసినదిగా కోరారు. కలిదిండి గంగరాజుగారి